iDreamPost
android-app
ios-app

ప్రముఖ నటి లక్ష్మిపై మాజీ భర్త మోహన్ శర్మ సంచలన కామెంట్స్..!

  • Published Mar 13, 2024 | 6:04 PM Updated Updated Mar 13, 2024 | 6:04 PM

Mohan Sharma Comments on Actress Lakshmi: చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలానికి విడిపోయిన జంటలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి లక్ష్మి ఒకరు.

Mohan Sharma Comments on Actress Lakshmi: చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతోమంది నటీనటులు తమ సహ నటులను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొంత కాలానికి విడిపోయిన జంటలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ నటి లక్ష్మి ఒకరు.

  • Published Mar 13, 2024 | 6:04 PMUpdated Mar 13, 2024 | 6:04 PM
ప్రముఖ నటి లక్ష్మిపై మాజీ భర్త మోహన్ శర్మ సంచలన కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో 70వ దశకంలో ఎన్నో చిత్రాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి లక్ష్మి. ఇండస్ట్రీ బ్యాగ్ గ్రౌండ్ నుంచి వచ్చిన లక్ష్మి 15వ ఏటనే సినీ రంగ ప్రవేశం చేసింది. ఈమె మొదటి చిత్రం 1968 లో రిలీజ్ అయిన ‘జీవనాంశమ్’. 1974లో మలయాళ మూవీ చట్టకారి, బాలీవుడ్ లో 1975 లో జూలీ చిత్రంతో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. జూలీ చిత్రానికి ఫిలిఫేర్ అవార్డు అందుకుంది. సినిమాల్లోనే కాదు ఆమె బుల్లితెరపై యాంకర్ గా సత్తా చాటారు. నటిగా ఎంత క్రేజ్ ఉన్నా.. ఆమెపై ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. నటి లక్ష్మీ మాజీ భర్త నటుడు మోహన్ శర్మ ఆమెపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తమిళ ఇండస్ట్రీలో నటిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి లక్ష్మీ తర్వాత తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది. నటిగానే కాకుండా వ్యాఖ్యాతగా కొంతకాలం పనిచేశారు. 70వ దశకంలో నటి లక్ష్మి కెరీర్ దేదీప్యమానంగా వెలిగిపోయింది. హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా భాస్కర్ ని వివాహం చేసుకుంది. కొంత కాలం తర్వాత వీరి మధ్య విభేదాలు రావడంతో 1975 లో ప్రముఖ నటుడు మోహన్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి వివాహబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరిగా నటుడు, దర్శకుడు శివ చంద్రన్ ని పెళ్లి చేసుకుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో నటుడు, లక్ష్మీ మాజీ భర్త మోహన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం రేపాయి.

Old actress lakshmi ex husband comments

నటుడు మోహన్ శర్మ మాట్లాడుతూ.. ‘70వ దశకంలో ఇద్దం మంచి నటులం. మేం ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించాం. 1975 లో పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. కొంతకాలం తర్వాత పలు విభేదాలతో 1980లో విడిపోయాం. లక్ష్మీ సడెన్ గా వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. ఆమె మాటలకు నేను షాక్ అయ్యాను. ఈ క్రమంలోనే ఇద్దరం ఓ హూటల్ లో కలిశాం. నేను ప్రస్తుతం కెరీర్ పై ఫోకస్ పెట్టాను.. పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచన లేదు అన్నాను. కానీ తాను మాత్రం పెళ్లిపై పట్టుపట్టింది. ఆ తర్వాత తన మాటకు విలువ ఇచ్చి నుదిటిపై బొట్టు పెట్టాను. ఆ రాత్రే తాము భార్యాభర్తలమయ్యాం. ఇద్దరం గౌరవ ప్రదమైన కుటుంబాల నుంచి వచ్చాం.. పెళ్లయ్యే వరకు మా మధ్య ఏం జరగలేదు. లాయర్ సమక్షంలో మా పెళ్లి విషయాన్ని మీడియాకు తెలియజేశాం. అప్పట్లో ఇద్దరం సినిమా బిజీగా ఉన్న కారణంగా పెళ్లి తర్వాత లక్ష్మీ నేను కలిసి ఎక్కువ సమయాన్ని గడపలేకపోయాం. కొన్ని విషయాల్లో లక్ష్మి పొరపాటు చేసింది.. వాటన్నింటి గురించి నేను వివరించలేను. ఆమె జీవితంలోకి మరో పురుషుడిని ఆహ్వానించింది.. అది తట్టుకోలేకపోయాను. కూతురు ఐశ్వర్యకు లక్ష్మికి మధ్య ఎప్పుడూ గొడవలే అయ్యేవి. నేను సర్ధి చెప్పినప్పటికీ ఇద్దరు పట్టించుకోకపోవడం బాధ అనిపించింది. ఇలా ఆమె నా విషయంలో ఎన్నో తప్పులు చేశారని’ అని అన్నారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş