iDreamPost
android-app
ios-app

అనంత్‌-రాధిక పెళ్లి వేడుకలపై పాక్ నటుడు అక్కసు.. బుద్ధి చెప్పిన నెటిజన్స్!

  • Published Jul 18, 2024 | 8:18 PM Updated Updated Jul 18, 2024 | 8:18 PM

Anant Ambani Wedding Celebrations: ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని వివాహం రాధికా మర్చంట్ తో జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది.

Anant Ambani Wedding Celebrations: ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబాని వివాహం రాధికా మర్చంట్ తో జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది.

  • Published Jul 18, 2024 | 8:18 PMUpdated Jul 18, 2024 | 8:18 PM
అనంత్‌-రాధిక పెళ్లి వేడుకలపై పాక్ నటుడు అక్కసు.. బుద్ధి చెప్పిన నెటిజన్స్!

ఆసియాలోని ఆగర్భశ్రీమంతుడు ముఖేష్ అంబానీ- నీతూ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం జులై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ఈ వేడుకలకు సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగంలోని దిగ్గజాలు హాజరయ్యారు. దేశం మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అంబానీ ఇంట పెళ్లి సంబరం గురించిన చర్చలే జరిగాయి. తన స్థోమతకు తగ్గట్టుగా పెళ్లి వేడుక అందరికీ జీవితాంతం గుర్తుండి పోయేలా జరిపించారు ముఖేష్ అంబానీ దంపతులు. తాజాగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలపై పాక్ నటుడు తన అక్కసు వెల్లబుచ్చాడు. వివరాల్లోకి వెళితే.

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ-నీతూ అంబానీ ముద్దుల తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరిగాయి. మార్చిలో అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి.. అప్పటి నుంచి అంబానీ ఇంట సెలబ్రెషన్స్ జరుగుతూనే వచ్చాయి. జులై 12న అనంత్ – రాధికా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. త్వరలో ఈ జంట లండన్ వెళ్లి అక్కడ పోస్ట్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ పెళ్లి వేడుకలపై పాకిస్థాన్ నటుడు అర్సలన్ నజీర్ సోషల్ మీడియాలో సెటైర్లు వేశాడు.

Netizens trolled pakistan actor

ఈ రోజుల్లో పెళ్లి వేడుకల ఎన్నాళ్లు జరుపుకుంటున్నారో.. అంతకాలం కూడా బంధాలు నిలబడటం లేదు అని తన ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబానీ ఇంట జరిగిన పెళ్లి వేడుకల గురించి ప్రపంచం మొత్తం సంతోషంగా చర్చ జరుగుతుంటే.. నటుడు చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ‘వాళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారు.. మధ్యలో నీకేంటీ సమస్య? అంటూ కొంతమంది నెటిజన్లు అంటే.. వాళ్లను చూసి నువ్వు కుళ్లుకుంటున్నావ్ కదూ, నీ డబ్బుతో సెలబ్రేట్ చేసుకోడం లేదు కదా.. మరి నువ్వెందుకు అంతగా బాధపడిపోతున్నావ్’ అంటూ నటుడికి సోషల్ మాధ్యమాల ద్వారా బుద్ది చెప్పారు.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio