iDreamPost
android-app
ios-app

Manoj Manchu: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో తండ్రి కాబోతున్న మనోజ్!

  • Published Dec 16, 2023 | 9:58 PM Updated Updated Dec 16, 2023 | 9:58 PM

తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దొంగ దొంగది మూవీతో హీరోగా మారాడు. తన మల్టీటాలెంట్ తో ఇండస్ట్రీలో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. దొంగ దొంగది మూవీతో హీరోగా మారాడు. తన మల్టీటాలెంట్ తో ఇండస్ట్రీలో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.

  • Published Dec 16, 2023 | 9:58 PMUpdated Dec 16, 2023 | 9:58 PM
Manoj Manchu: ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్వరలో తండ్రి కాబోతున్న మనోజ్!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, దర్శక, నిర్మాతల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా కొద్దిమందే సక్సెస్ ఫుల్ హీరోలుగా కొనసాగుతూ వచ్చారు. ప్రముఖ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో మంచు మనోజ్ మల్టీ టాలెంట్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దుమ్మురేపాడు.  కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల భూమా మౌనిక రెడ్డిని  పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంచు వారి అబ్బాయి ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

మంచు మనోజ్ తన ఫ్యాన్స్ కి ఓ శుభవార్త చెప్పారు. తన భార్య భూమ మౌనిక రెడ్డి తల్లి కాబోతుందంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ సందర్భంగా తన అత్త మామలను తల్చుకున్నారు మంచు మనోజ్.  తాజాగా తన అత్తమ్మ శ్రీమతి శోభా నాగిరెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఆమెను స్మరించుకుంటూ ఓ సంతోషకరమైన వార్త చెప్పాలనుకుంటున్నా అంటూ.. ‘అత్తమ్మ.. భూమా నాగి రెడ్డి మామయ్య మీరు మరోసారి అమ్మమ్మ, తాత అవుతున్నారు. మా చిన్న ధైరవ్ పెద్ద అన్న అవుతున్నందుకు థ్రిల్‌గా ఉన్నాడు. ఎదుగుతున్న మా కుటుంబాన్ని అంతులేని ప్రేమతో మీరు చూస్తూనే ఉంటారనీ, రక్షిస్తారని, ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను. మా అమ్మ నిర్మల, నాన్న మోహన్ బాబు ఆశిస్సులతో.. మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక మంచు మనోజ్ విషయానికి వస్తే.. బుల్లితెరపై తన సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. ఈ మధ్యనే ‘ఉస్తాద్’ షో ని లాంచ్ చేశాడు. ఆ మధ్య అహం బ్రహ్మస్మి మూవీ లాంచ్ చేసి తర్వాత పక్కన బెట్టారు. ఇక వాట్ ది ఫిష్ అంటూ ఇటీవల కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. అలాగే ఓ గేమ్ షోను లాంచ్ చేసి దానికి హూస్ట్ గా రాబోతున్నారు. ఇప్పటి వరకు చాలా గ్యాప్ వచ్చింది.. ఇక మీతో ఫుల్ గా టచ్ లో ఉంటా దుమ్మురేపుదాం అంటూ ఇటీవల ఓ షోలో చెప్పాడు. అంతేకాదు త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా యాక్టీవ్ గా ఉంటానని ఆ మద్య చెప్పాడు. ఏది ఏమైనా మంచు ఫ్యాన్స్ కి ఇది గొప్ప శుభవార్త అంటున్నారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss