iDreamPost
android-app
ios-app

మంచు మనోజ్ దంపతుల కూతురుకి బారసాల.. పేరు ఏంటో తెలుసా? ‘బాహబలి’ గుర్తుకొస్తుంది..

  • Published Jul 08, 2024 | 2:19 PM Updated Updated Jul 08, 2024 | 2:19 PM

Manchu Manoj: తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు. ఇటీవల మంచు మనోజ్ కి పండంటి ఆడబిడ్డ జన్మించింది.

Manchu Manoj: తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మనోజ్ లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా కొనసాగుతున్నారు. ఇటీవల మంచు మనోజ్ కి పండంటి ఆడబిడ్డ జన్మించింది.

  • Published Jul 08, 2024 | 2:19 PMUpdated Jul 08, 2024 | 2:19 PM
మంచు మనోజ్ దంపతుల కూతురుకి బారసాల.. పేరు ఏంటో తెలుసా? ‘బాహబలి’ గుర్తుకొస్తుంది..

తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సాంఘిక, పౌరాణిక, జానపద, కుటుంబ చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు.వెండితెరపై ఆయన కొట్టే డైలాగ్స్ థియేటర్లలో చప్పట్లు, విజిల్స్ మారుమోగేవి. మంచు కుటుంబం నుంచి ఆయన తనయులు మంచు విష్ణు, మనోజ్ లతో పాటు కూతురు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా చాటారు. మంచు మనోజ్.. భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. పాపకు మంచు మనోజ్ అదిరిపోయే పేరు పెట్టాడు. వివరాల్లోకి వెళితే.

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు సోమవారం నాడు తన కూతురికి నామకరణం చేశారు. గత ఏడాది మంచు మనోజ్, మౌనిక ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగు పెట్టారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. మాజీ ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి కూతురే మౌనికా రెడ్డి.  ఏప్రిల్ 13న మౌనిక‌కు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ విషయం మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో ‘మా ఇంట్లోకి ఓ చిన్న దేవత వచ్చింది.. తనకు ఎంఎం పులి అంటూ నిక్ నేమ్’ కూడా పెట్టామంటూ తెలిపింది. సోమవారం (జులై 8) తమ ముద్దుల పాపకు నామకరణోత్సవం జరిపారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా.. తన పాప పేరు గురించి చెప్పుకొచ్చాడు. ‘దేవసేన శోభ ఎంఎం’ లో తన అత్తగారి పేరు శోభా నాగిరెడ్డి, అలాగే సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరు వచ్చేలా  నామకరణం చేసినట్లు తెలిపాడు.  మీ అందరి ఆశీస్సులు నా ఫ్యామిలీ పై ఉండాలంటూ కోరాడు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులు మంచు మోహన్ బాబు, నిర్మల దేవి,  మౌనిక రెడ్డి అక్క భూమా అఖిలప్రియ, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు  పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్నారి పేరు వింటుంటే బాహుబలిలో రమ్య కృష్ణ నటించిన దేవసేన గుర్తుకు వస్తుందని కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet