iDreamPost
android-app
ios-app

అతడికి మూడో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు రెండో బాయ్ ఫ్రెండ్!

  • Author Soma Sekhar Published - 07:42 PM, Tue - 11 July 23
  • Author Soma Sekhar Published - 07:42 PM, Tue - 11 July 23
అతడికి మూడో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు రెండో బాయ్ ఫ్రెండ్!

సాధారణంగా ఇండస్ట్రీలో ప్రేమ కథలకు కొదవుండదు. హీరో, హీరోయిన్ల మధ్య, నటీ, నటుల మధ్య, డైరెక్టర్, హీరోయిన్ల మధ్య ప్రేమలు పెళ్లిళ్లు జరగడం మనం చూసే ఉన్నాం. ఇక చాటుమాటున డేటింగ్ చేసే సెలబ్రిటీ జంటలు కోకొల్లలు. ఏదైనా జంట మీడియా కంటపడితే.. మీరు డేటింగ్ చేస్తున్నారా? అని ప్రశ్నిస్తే.. కొంతమంది సమాధానం చెబితే.. మరికొంతమంది ఆన్సర్ చెప్పకుండా దాటవేస్తారు. తాజాగా ఓ టాలీవుడ్ నటుడు కూడా ఇదేవిధంగా ఆన్సర్ దాటవేశాడు. ఏకంగా పెళ్లైన బాలీవుడ్ నటితో డేటింగ్ చేస్తున్నాడట తెలుగు నటుడు.

హర్షవర్ధన్ రానే.. రాజమండ్రికి చెందిన టాలీవుడ్ నటుడు. తెలుగులో అవును, ఫిదా, గీతాంజలి, బెంగాల్ టైగర్ లాంటి మరికొన్ని చిత్రాల్లో నటించాడు. కానీ తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాకపోవడంతో.. బాలీవుడ్ కు మకాం మార్చాడు హర్షవర్ధన్. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే యాక్టింగ్ తో పాటుగా డేటింగ్ వార్తలతో కూడా బాగా పాపులర్ అయ్యాడు ఈ యంగ్ యాక్టర్. గతంలో కీమ్ శర్మ, మీనాక్షి దాస్ తో డేటింగ్ చేశాడని వార్తలు జోరుగా వినిపించాయి. కానీ వాళ్లతో మనోడికి సెట్ కాలేదు. దాంతో వారితో విడిపోయాడు హర్షవర్ధన్.

తాజాగా మరో నటితో డేటింగ్ చేస్తున్నాడంటూ బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. హిందీ నటి సంజీదా షేక్ తో ఇతడు ప్రేమాయాణం నడిపిస్తున్నాడ అక్కడి సినిమా వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. వీళ్లిద్దరూ కలిసి తాజాగా టూర్ కు వెళ్లారు. ఆ టూర్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దాంతో మీడియా హర్షవర్ధన్ ను ఇదే విషయాన్ని అడగ్గా.. ఎటూ తేల్చకుండా ఆన్సర్ ఇచ్చాడు. దాంతో వీరిద్దరు డేటింగ్ నిజమేనని తేలింది. ఇక సంజీదా షేక్ 2012లో నటుడు అమిర్ అలీని పెళ్లి చేసుకుంది. వీరిద్దరు గతేడాది విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హర్షవర్ధన్ తో కలిసి చెట్టాపట్టాలేసుకుని వెకేషన్లను ఎంజాయ్ చేస్తోంది. దాంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. అతడికి మూడో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు రెండో బాయ్ ఫ్రెండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: అభిమాని పుట్టినరోజు సెలబ్రేట్ చేసిన బాలకృష్ణ! ఫోటోస్ వైరల్..

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetist girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş