iDreamPost

స్టార్ హీరోతో హీరోతో క్లోజ్ గా ఆ హీరోయిన్? భార్య వార్నింగ్?

కన్నడ స్టార్ హీరోతో ఓ హీరోయిన్ ఎఫైర్ పెట్టుకున్నట్టు అక్కడి మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసిన ఆ హీరో భార్య ఆ హీరోయిన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కన్నడ స్టార్ హీరోతో ఓ హీరోయిన్ ఎఫైర్ పెట్టుకున్నట్టు అక్కడి మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసిన ఆ హీరో భార్య ఆ హీరోయిన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్టార్ హీరోతో హీరోతో క్లోజ్ గా ఆ హీరోయిన్? భార్య వార్నింగ్?

సాధారణంగా ఏ ఇండస్ట్రీలోనైనా హీరో హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉందని గుసగుసలు వినిపించడం సహజమే. నటీ నటులు వారు కలిసి నటించే క్రమంలో కాస్త క్లోజ్ గా కనిపించారంటే చాలు ఇటు ఆడియెన్స్ తో పాటు అటు సినీ వర్గాల్లో కూడా రూమర్స్ ఊపందుకుంటాయి. ఇది వరకు ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకున్నాయి. అయితే ఇప్పుడు కన్నడ స్టార్ హీరోతో ఓ హీరోయిన్ ఎఫైర్ పెట్టుకున్నట్టు అక్కడి మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం తెలిసిన ఆ హీరో భార్య ఆ హీరోయిన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే హీరో దర్శన్ ఇంట్లో గొడవలు జరిగాయని ప్రచారం సాగుతోంది. దర్శన్ భార్య విజయలక్ష్మి, పవిత్ర గౌడ అనే హీరోయిన్ తో గొడవ పెట్టుకున్నట్లుగా శాండల్ వుడ్ లో టాక్ వినిపిస్తోంది.

కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోయిన్ తో ఎఫైర్ విషయంతో వార్తల్లోకి ఎక్కారు. ఇందులో నిజమెంతో తెలియదు గానీ ఆయన భార్య మాత్రం ఆ హీరోయిన్ పై మండిపడ్డారట. హీరోయిన్ పవిత్ర గౌడ దర్శన్ తో ఎఫైర్ పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనికి మరింత ఊతమిచ్చేలా పవిత్ర గౌడ ఇటీవల తాను దర్శన్ తో క్లోజ్ గా దిగిన ఫొటోలను ఓ వీడియోగా రూపొందించి ఇన్ స్టాలో పోస్టు చేశారు. మన పదేళ్ల రిలేషన్ షిప్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఇది చూసిన హీరో దర్శన్ భార్య విజయ లక్ష్మీ హీరోయిన్ పవిత్ర గౌడపై ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై దర్శన్ తో కనిపిస్తే బాగుండదంటూ హెచ్చరించారట. కాగా ఈ వ్యవహారంలో నిజనిజాలేంటి అనే దానిపై పూర్తి క్లారిటీ లేదు. మరి ఎఫైర్ వ్యవహారంలో హీరో భార్య హీరోయిన్ కు వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

That heroine who had an affair with the star hero Wife warning

 

View this post on Instagram

 

A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithra_gowda_7)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి