iDreamPost
android-app
ios-app

జైలులో నిందితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దర్శన్.. ఫోటో వైరల్!

  • Published Aug 25, 2024 | 5:37 PM Updated Updated Aug 25, 2024 | 5:37 PM

Darshan: ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న ఆరోపణలపై అతడ్ని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్. కాగా, ఇప్పుడు పరప్పన్ జైలులో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ ఫోటో లీక్ కావడంతో...

Darshan: ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపాడన్న ఆరోపణలపై అతడ్ని హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్. కాగా, ఇప్పుడు పరప్పన్ జైలులో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఓ ఫోటో లీక్ కావడంతో...

  • Published Aug 25, 2024 | 5:37 PMUpdated Aug 25, 2024 | 5:37 PM
జైలులో నిందితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దర్శన్.. ఫోటో వైరల్!

కన్నడ ఇండస్ట్రీనే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని కుదిపేసిన న్యూస్.. శాండల్ వుడ్ స్టార్ హీరో, డీ బాస్ దర్శన్ తూగదీప అరెస్ట్. ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడన్న కోపంతో చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని కిడ్నాప్ చేసి.. బెంగళూరుకు తీసుకు వచ్చి అత్యంత దారుణంగా కొట్టి చంపాడు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు హత్యకు కారణమైన 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులు పరప్పన్ అగ్రహార జైలులో ఉన్నారు. కాగా, దర్శన్ బెయిల్ కోసం ఆయన భార్య ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు జైలులో ఎంజాయ్ చేస్తున్న దర్శన్, అతడి గ్యాంగ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిందితులంతా ఓ చోట చేరి.. బిందాస్‌గా ముచ్చట్లలో తేలిన ఫోటో ట్రెండ్ అవుతుంది.

దర్శన్ చేతిలో కప్పు, ఎడమ చేతిలో సిగరెట్‌తో బ్యారక్ బయట కూర్చీలో కూర్చొని సేద తీరుతున్న ఫోటో లీక్ అయ్యింది. దర్శన్‌తో పాటు రేణుకా స్వామి హత్య కేసులో సహకరించిన అతని వెంట రౌడీ షీటర్ విల్సన్ గార్డెన్ నాగ, దర్శన్ మేనేజర్ నాగరాజ్, అతని హెయిర్ స్టైలిస్ట్ కుల్ల సేన అని పిలువబడే మరొక ఖైదీ కూడా చిల్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ముగ్గురు కుర్చీలో కూర్చొని ముచ్చట్లలో తేలారు. వేలు అనే మరో ఖైదీ ఈ ఫొటో తీసి అతడి భార్యకు పంపాడు. అది కాస్త లీక్ కావడంతో ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తుంది. దర్శన్ కటకటాల వెనుక ఉన్న సమయంలో అతనికి కల్పించిన సౌకర్యాల గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇప్పుడు రౌడీ షీటర్‌తో ఉన్న ఫోటో వైరల్‌గా మారడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ ఛాలెంజింగ్ స్టార్.

జైలులో ఉన్న దర్శన్‌కు సిగరెట్స్, ఒక కప్పు టీని ఎలా వచ్చాయోనన్న ఆందోళన నెలకొడంతో పాటు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దర్శన్ కోసం జైలులో మంచి ఏర్పాట్లు చేశారని విమర్శలు మొదలయ్యాయి. కూర్చోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారని, ఇతర ఖైదీలతో పోల్చితే దర్శన్ కు లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కేసులో 3 వేల పేజీలతో చార్జీ షీట్ తయారు చేశారు పోలీసులు. పెద్ద సంఖ్యలో సాక్షుల, నిందితుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేశారు. ఇందులో ఏ 1 నిందితుడిగా దర్శన్ పేరును చేర్చారు. త్వరలో కోర్టులో ఈ చార్జిషీటును సమర్పించే అవకాశం ఉంది. ఆ తర్వాత దర్శన్, ఇతర నిందితులకు బెయిల్ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet