iDreamPost
android-app
ios-app

Darshan: హత్య తర్వాత పవిత్ర గౌడపై నటుడు దర్శన్‌ దాడి..?

  • Published Jun 11, 2024 | 3:20 PM Updated Updated Jun 11, 2024 | 3:20 PM

ఓ వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్‌ దర్శన్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

ఓ వ్యక్తి హత్య కేసులో కన్నడ స్టార్‌ దర్శన్‌ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

  • Published Jun 11, 2024 | 3:20 PMUpdated Jun 11, 2024 | 3:20 PM
Darshan: హత్య తర్వాత పవిత్ర గౌడపై నటుడు దర్శన్‌ దాడి..?

కన్నడ స్టార్‌ హీరో.. చాలెంజింగ్‌ స్టార్‌ దర్శన్‌ ఓ హత్య కేసులో అరెస్ట్‌ కావడం సంచలనంగా మారింది. దర్శన్‌ అరెస్ట్‌.. కన్నడ పరిశ్రమను కుదుపేస్తుంది. ఇక ఈ కేసులో దర్శన్‌తో పాటు.. అతడి ప్రియురాలు, నటి పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేణుక స్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్‌ను అరెస్ట్‌ చేశారు. మరి దర్శన్‌ రేణుకను ఎందుకు హత్య చేశాడంటే.. అతడు.. సోషల్‌ మీడియా వేదికగా.. దర్శన్‌ ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజులు పంపి వేధింపులకు గురి చేశాడు. దీని గురించి పవిత్ర గౌడ.. దర్శన్‌కు తెలిపింది. తన లవర్‌ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడంతో.. తీవ్ర ఆగ్రహానికి గురైన దర్శన్‌.. కొందరితో కలిసి రేణుకస్వామిని కిడ్నాప్‌ చేయించి ఆపై హత్య చేయించాడు. నిందితులను విచారించగా.. వారు దర్శన్‌ చెప్పారు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. దర్శన్‌ పవిత్రపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

పవిత్ర, దర్శన్‌లు గత కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఇద్దరూ కలిసి తిరుగుతున్నారు. పదేళ్ల నుంచి వీరి మధ్య రిలేషన్‌ ఉంది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలను కూడా షేర్‌ చేస్తుంటారు. అయితే వీరి రిలేషన్‌ గురించి రేణుకాస్వామి అనే వ్యక్తి సోషల్‌ మీడియా వేదికగా.. అసభ్య కామెంట్స్‌ చేశాడు. దీని గురించి తెలుసుకున్న దర్శన్‌.. అతడిపై దాడి చేశాడు. అయితే రేణుకాస్వామి మర్డర్‌ తర్వాత.. దర్శన్‌.. పవిత్రపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆగ్రహంలో ముందు వెనుకా ఆలోచించకుండా.. రేణుకాస్వామిని హత్య చేశాడు. ఆతర్వాత వాస్తవం అర్థం కావడంతో.. పవిత్ర వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని రియలైజ్‌ అయ్యాడు. దాంతో ఆమెపై దాడి చేశాడని తెలుస్తోంది.

ఈ దాడిలో పవిత్ర గాయపడటంతో.. ఆమె బెంగళూర్‌లోని ఆర్‌ఆర్‌ ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందింది. సోమవారం నాడు ఆస్పత్రి నుంచి డిశ్జార్జ్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ హత్య కేసులో దర్శన్‌ భాగస్వామి అనేది నిజమైతే.. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దర్శన్‌ ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే ప్రథమం కాదు. గతంలో అనగా 2011లో దర్శన్‌ తనను వేధిస్తున్నాడంటూ అతడి భార్య విజయలక్ష్మి.. ఈహీరోపై గృహహింస కేసు నమోదు చేసింది. అప్పుడు పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. 14 రోజులు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నాడు. అలానే మరోసారి ఓ హోటల్‌లో వెయిటర్‌పై చేయి చేసుకోగా.. వివాదం రాజుకుంది. డబ్బులిచ్చి గొడవను సెటిల్‌ చేసుకున్నాడు అంటారు.

ఇక కన్నడ నాట దర్శన్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. అసిస్టెంట్‌ కెమరామాన్‌ స్థాయి నుంచి హీరో, సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. 2003లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. ఇక పవిత్ర గౌడ విషయానికి వస్తే.. ఆమె 2013లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. పవిత్రకు కూడా గతంలోనే సంజయ్‌ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. వీరికి ఓ కుమార్తె కూడా ఉంది. అయితే విబేధాల కారణంగా పవిత్ర కూడా భర్త నుంచి విడిపోయింది.

ఆ తర్వాత ఆమెకు దర్శన్‌తో పరిచయం.. అది కాస్త రిలేషన్‌గా మారడం సంచలనంగా మారింది. ఇక వీరిద్దరి గురించి తెలిసి దర్శన్‌ భార్య విజయలక్ష్మి గొడవ చేసింది. ఇక మరణించి రేణుకస్వామి దర్శన్‌కు వీరాభిమాని. తమ ఫేవరేట్ హీరో భార్యకు అన్యాయం చేయడం సరికాదంటూ బహిరంగ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా పవిత్ర వైఖరిని తప్పుపట్టేవాడు. ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపి.. ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నాడు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/