iDreamPost
android-app
ios-app

హత్య కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్!

  • Published Jun 11, 2024 | 11:31 AM Updated Updated Jun 11, 2024 | 11:31 AM

Actor Darshan Arrested: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పలు నేరాలకు పాల్పపడి సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. చట్టం ఎవరి చుట్టం కాదని అందుకు అరెస్టులే నిదర్శనం అని పోలీసులు చెబుతున్నారు.

Actor Darshan Arrested: ఇటీవల సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు పలు నేరాలకు పాల్పపడి సందర్భంలో పోలీసులు అరెస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. చట్టం ఎవరి చుట్టం కాదని అందుకు అరెస్టులే నిదర్శనం అని పోలీసులు చెబుతున్నారు.

  • Published Jun 11, 2024 | 11:31 AMUpdated Jun 11, 2024 | 11:31 AM
హత్య కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్!

ఈ మధ్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులు చేయడం.. కొన్నిసార్లు హత్యలకు కూడా పాల్పపడుతున్నారు. సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు సైతం కొన్నిసార్లు విచక్షణ కోల్పోయి దాడులు చేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. నేరం ఎవరు చేసినా చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయం తెలిసిందే. ఇటీవల కొంతమంది సినీ తారలు పలు నేరాల్లో చిక్కుకొని జైలుకు వెళ్తున్నారు. తాజాగా కన్నడ స్టార్ హీరోని మర్డర్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ నటుడు కులికల్ జయచంద్రన్.. నాలుగేళ్ల పాపపై అత్యాచారం చేశారని పోలీసులు అరెస్ట్ చేసిన వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ మధ్యనే బెంగుళూరు  రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లుగా సినీ నటి హేమ ని అరెస్ట్ చేశారు. తాజాగా మరో స్టార్ హీరో ఏకంగా మర్డర్ కేసులో అరెస్టు చేశారు పోలీసులు. ఈ వార్తలు వైరల్ కావడంతో  అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందని ప్రేక్షకులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఓ మర్డర్ కేసులో కన్నడ నటుడు చాలెంజింగ్ స్టార్ దర్శన్ ని మైసూర్ కామాక్షి పాళ్య పోలీసులు మంగళవారం అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్ ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. గతంలో పవిత్ర గౌడను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు సంచలనం రేపిన విషయం తెలిసిందే.

దర్శన్, పవిత్ర గౌడ్ ఫోటోలు లీక్ కావడంతో ఈ విషయం కన్నడ నాట పెను దుమారం రేపింది. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రత్యక్షంగా దర్శన్ ప్రమేయం ఉన్నట్లు హత్య చేసిన నింధితులు పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే దర్శన్ ని మైసూర్ ఫామ్ హౌజ్ లో అరెస్ట్ చేసి బెంగుళూరు కు తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. హత్య కేసులో దర్శన్ తో పాటు మరో పది మందిని కామాక్షిపాళ్య పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హత్య కేసులో అంతకు ముందే ముగ్గురు లొంగిపోయినట్లు తెలుస్తుంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ ని అరెస్ట్ చేసినట్లు వార్తలు రావడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet