iDreamPost
android-app
ios-app

స్టార్ కమెడియన్ చార్లీ కుమారుడి వివాహ రిసెప్షన్.. హాజరైన సీఎం స్టాలిన్!

  • Published Jun 10, 2024 | 6:37 PM Updated Updated Jun 10, 2024 | 6:37 PM

Actor Charlie: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల, దర్శక, నిర్మాతలు ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా తమిళ స్టార్ కమెడియన్ చార్లీ ఇంట పెళ్లి భాజాలు మోగాయి.

Actor Charlie: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల, దర్శక, నిర్మాతలు ఇంట పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తాజాగా తమిళ స్టార్ కమెడియన్ చార్లీ ఇంట పెళ్లి భాజాలు మోగాయి.

  • Published Jun 10, 2024 | 6:37 PMUpdated Jun 10, 2024 | 6:37 PM
స్టార్ కమెడియన్ చార్లీ కుమారుడి వివాహ రిసెప్షన్.. హాజరైన సీఎం స్టాలిన్!

ఈ ఏడాది సీనీ నటులు, వారి బంధుల ఇంట వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట పెళ్లి సందడి మొదలయ్యింది.. ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హల్దీ, మెహందీ వేడుకులు మొదలయ్యాయి. తమిళ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న చార్లీ చిన్న కుమారుడు అజయ్ తంగస్వామి వివాహం రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు.ప్రస్తుతం ఈ రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళ నాట తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే నటుడు చార్లీ. తాజాగా చార్లీ చిన్న కుమారుడు అజయ్ తంగస్వామి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నేడు నూతన దంపతుల రిసెప్షన్ వేడుక జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చార్లీ విషయానికి వస్తే.. కోవల్ పట్టికి చెందిన ఆయన శివాజీ గణేషన్, ముత్తు రామన్, నగేష్ వంటి నటులతో కలిసి నటించారు.సినిమాల్లోకి రాకముందు ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా.. వద్దనుకొని ఇండస్ట్రీవైపు మొగ్గుచూపించారు.

చారీ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖలో పాటలు , నాటకాల విభాగంలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా పని ప్రారంభిచారు. 1983 లో దర్శకుడు బాల చందర్ సినిమా ‘పోయికల్ ఫోడా మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 800 సినిమాల కన్నా ఎక్కువ నటించారు. హాలీవుడ్ స్టార్ కమెడియన్ చార్లీ చాంప్లెన్ అనేవారు.. అదే పేరు చార్లీగా స్థిరపడిపోయింది. చార్లీ కొడుకులు, కూతుళ్లు అందరూ చదువుకున్నావారే. తాజాగా చార్లీ తనయుడు వివాహ రిసెప్షన్ కి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రావడంతో అక్కడ సందడి నెలకొంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss