iDreamPost
android-app
ios-app

దారుణంగా మోసపోయిన నటుడు బాబీ సింహ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!

  • Published Sep 28, 2023 | 9:18 PM Updated Updated Sep 28, 2023 | 9:18 PM
  • Published Sep 28, 2023 | 9:18 PMUpdated Sep 28, 2023 | 9:18 PM
దారుణంగా మోసపోయిన నటుడు బాబీ సింహ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!

తెలుగు వాడైనా తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు బాబీ సింహ. హీరోగా, సహాయనటుడిగా, విలన్‌గా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రస్తుతం సినిమాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా ఉండే ఆయన్ని ఓ వ్యక్తి దారుణంగా మోసం చేశారు. ఇంటి నిర్మాణంలో అవకతవకలకు పాల్పడి లక్షల రూపాయలు దోచేశాడు. దీంతో బాబీ సింహ ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంతకీ సంగతేంటంటే.. బాబీ సింహ తమిళనాడులోని కొడైకెనాల్‌లో ఓ అద్భుతమైన ఇంటిని నిర్మించాలని అనుకున్నారు. ఇంటి నిర్మాణ బాధ్యతలను జమీర్‌ అనే ఆర్కిటెక్ట్‌కు అప్పగించాడు. రెండు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం మొదలైంది. దాదాపు కోటిన్నర రూపాయల బడ్జెట్‌తో ఈ ఇంటి నిర్మాణం మొదలైంది. ఇంటి నిర్మాణం పూర్తవటానికి వస్తున్న నేపథ్యంలో జమీర్‌ మోసానికి తెరలేపాడు. ఇంటి నిర్మాణాన్ని ఆపేశాడు. అదనంగా 50 లక్షల రూపాయలు ఇస్తే గానీ ఇంటి పనులు మొదలుపెట్టనని తేల్చిచెప్పాడు.

దీంతో బాబీ సింహ షాక్‌ అయ్యాడు. అదనంగా డబ్బులు ఇవ్వనని అన్నాడు. అప్పటినుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సంప్రదింపులు జరుగుతున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో బాబీ సింహ కొడైకెనాల్‌ పోలీసులను ఆశ్రయించారు. జమీర్‌పై అతడి బంధువు ఉశేన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జమీర్‌ మధ్యలో వదిలేసిన ఇంటి నిర్మాణం దగ్గర బాబీ సింహ ఆవేదన ‍వ్యక్తం చేస్తున్న దృశ్యాల తాలూకా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetboo girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom