iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

  • Published Oct 15, 2024 | 10:46 AM Updated Updated Oct 15, 2024 | 10:46 AM

Actor Atul Parchure: ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ ప్రముఖులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు.

Actor Atul Parchure: ఇటీవల సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినీ ప్రముఖులు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం కన్నీటి సంద్రంలో మునిగిపోతున్నారు.

  • Published Oct 15, 2024 | 10:46 AMUpdated Oct 15, 2024 | 10:46 AM
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వరుసగా కన్నుమూస్తున్నారు. హార్ట్ ఎటాక్, వయోభారం, అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాల వల్ల కొంతమంది అయితే.. కెరీర్ సరిగా సాగక ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరికొంతమంది వెండితెర, బుల్లితెర నటీనటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఆదిపురుష్ నటి ఆశా వర్మ, బాలీవుడ్ నటుడు వికాస్ సేథీ, నిర్మల్ బెన్నీ, తమిళ కమెడియన్ బిజిలి రమేష్, ప్రొడ్యూసర్ ఢిల్లీ బాబు, నటి సీఐడీ శకుంతల కన్నుమూశారు. మరో ప్రముఖ కమెడియన్ కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది.

స్టార్ కమెడియన్, మారఠీ నటుడు కన్నుమూశారు. ది కపిల్ శర్మ షో ఫేమ్ అతుల్ పర్చురే కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు మరాఠీ సీరియల్స్, మూవీస్ లో నటించి బెస్ట్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు .  ఇటీవల పలు టీవీ రియాల్టీ షోల్లో కనిపించాడు. గత ఏడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ మూవీలో కూడా అతుల్ నటించాడు. నటుడిగా మంచి పీక్ స్టేజ్ లో ఉన్నపుడే క్యాన్సర్ భారిన పడ్డారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

మరాఠీ, హిందీ సినిమాలు, టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న అతుల్.. ది కపిల్ శర్మ షో బాగా పేరు తెచ్చిపెట్టింది. తనదైన కామెడీ పంచ్ లతో ప్రేక్షకులను అలరించారు. అతుల్ పర్చురే ఎక్కువగా బుల్లితెరపై నటించారు. కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు పడి ఒక స్థాయికి వచ్చి వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకున్న అతుల్ మరణం పట్ల బాలీవుడ్ తో పాటు మరాఠీ చిత్ర సీమ దిగ్బ్రాంతికి గురైంది. అతని మరణ వార్త విన్న అభిమానులు, సహ నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అతుల్ పర్చురే హిందీ, మరాఠీ ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకుంటున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetesrar satın algrandpashabet