iDreamPost
android-app
ios-app

వీడియో: పెళ్లి చేసుకున్న బుల్లితెర నటుడు.. వధువు ఎవరంటే?

  • Published May 10, 2024 | 3:59 PM Updated Updated May 10, 2024 | 3:59 PM

Akarsh Byramudi: సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తమకు నచ్చిన వారిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు సెలబ్రెటీలు.

Akarsh Byramudi: సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. తమకు నచ్చిన వారిని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు సెలబ్రెటీలు.

  • Published May 10, 2024 | 3:59 PMUpdated May 10, 2024 | 3:59 PM
వీడియో: పెళ్లి చేసుకున్న బుల్లితెర నటుడు.. వధువు ఎవరంటే?

ఇటీవల బుల్లితెర, వెండితెరకు సంబంధించిన నటీనటులు.. ఇతర టెక్నిషియన్స్ వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇండస్ట్రీలో చాలా వరకు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొంతమంది సెలబ్రెటీలు చాలా పర్సనల్ గా వెడ్డింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే వివాహ వేడుకు హాజరవుతున్నారు. తర్వాత పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా బుల్లితెర నటుడు తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో, పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ వచ్చాయి.. కానీ కొన్ని సీరియల్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటున్నాయి. అలాంటి వాటిలో ‘మామగారు’ సీరియల్ ఒకటి. తాజాగా మామగారు సీరియల్ ఫేమ్ గంగాధర అలియాస్ ఆకర్ష బైరమూడి పెళ్లి పీటలు ఎక్కాడు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేశాడు. ఆకర్ష బైరమూడి పెళ్లికి సంబంధించిన వీడియోలు సెలబ్రిటీ యాంకర్, యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహా పోస్ట్ చేశారు. దీంతో ఆకర్ష్ కు సోషల్ మీడియాలో అభిమానుల, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కర్ణాటకలో పుట్టి పెరిగిన ఆకర్ష నటుడిగా రాణించడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు.

ప్రస్తుతం తెలుగు, కన్నడ సీరియల్స్ లో హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో పున్నాగ, అత్తారింట్లో అక్కచెల్లెళ్లు, అగ్ని పరీక్ష, రాజేశ్వరి విలాస్ కాఫీ తదితర సీరియల్స్ లో నటించాడు. ఆకర్ష్ ‘మామగారు’ సీరియల్ తో మంచి పేరు సంపాదించాడు. నిఖిల్ విజయేంద్ర ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన విడియోల పెళ్లి కూతురు ని సస్పెన్స్ గా ఉంచారు. కాకపోతే గతంలో ఓ టీవీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశాడు ఆకర్ష్. ఆమె పేరు ఐశ్వర్య. కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. మొత్తానికి ఇరు కుటుంబ పెద్దలనుఒప్పించి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha)

 

View this post on Instagram

 

A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom