iDreamPost
android-app
ios-app

ఆ మెసేజ్ వల్లే ఇదంతా.. నటి కల్పికతో ఎఫైర్ పై అభినవ్ గోమటం క్లారిటీ!

  • Author Soma Sekhar Published - 12:34 PM, Sun - 29 October 23

నటి కల్పికా గణేష్ తో జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చాడు అభినవ్ గోమటం. వీరిద్దరి మధ్య గతంలో సోషల్ మీడియా వేదికగా వార్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఒక్క మెసేజ్ వల్లే ఇంత రచ్చ జరిగిందని తెలిపాడు.

నటి కల్పికా గణేష్ తో జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చాడు అభినవ్ గోమటం. వీరిద్దరి మధ్య గతంలో సోషల్ మీడియా వేదికగా వార్ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఒక్క మెసేజ్ వల్లే ఇంత రచ్చ జరిగిందని తెలిపాడు.

  • Author Soma Sekhar Published - 12:34 PM, Sun - 29 October 23
ఆ మెసేజ్ వల్లే ఇదంతా.. నటి కల్పికతో ఎఫైర్ పై అభినవ్ గోమటం క్లారిటీ!

ఇండస్ట్రీలో నటీ, నటులు ఇతర వ్యక్తులపై, సహ నటీ, నటులపై షాకింగ్ కామెంట్స్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఇక ఈ కామెంట్స్ పై ఇద్దరిలో ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇస్తే గానీ.. ఆ వార్తలకు ముగింపు ఉండదు. తాజాగా తనపై వచ్చిన ఆరోపణల గురించి క్లారిటీ ఇచ్చాడు టాలీవుడ్ కమెడియన్ అభినవ్ గోమటం. గతంలో నటి కల్పికా గణేష్, అభినవ్ పై అనేక ఆరోపణలు చేసింది. ఆ సమయంలో వీరిద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ కూడా జరిగింది. అభినవ్ తనను వేధించాడని, తన పట్ల అసభ్యంగా మాట్లాడాడు అని అప్పట్లో కల్పిక సంచలన కామెంట్స్ చేసింది. వీరిద్దరి గొడవ చివరికి పోలీసుల వరకూ వెళ్లింది. తాజాగా వీరిద్దరి మధ్య జరిగిన గొడవపై క్లారిటీ ఇచ్చాడు అభినవ్ గోమటం.

నటి కల్పికా గణేష్-అభినవ్ గోమటం మధ్య గతంలో జరిగిన వార్ గురించి మనకు తెలిసిందే. అభినవ్ పై సంచలన ఆరోపణలు చేసింది కల్పిక. దీంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందని అందరూ అనుకున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య గొడవ గురించి, ఎఫైర్ గురించి క్లారిటీ ఇచ్చాడు అభినవ్ గోమటం. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కల్పిక గురించి అభినవ్ ఈ విధంగా మాట్లాడాడు..”కల్పిక నాకు కేవలం ఫ్రెండ్ మాత్రమే. ఆమెతో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు. అలాగే ఆమెతో పెద్దగా పరిచయం కూడా లేదు. అయితే మేమిద్దరం అప్పుడప్పుడు చాట్ చేసుకునే వాళ్లం. అందులో భాగంగానే ఆమెకు నారీ శక్తి అవార్డు వచ్చిందని నాకు మెసేజ్ చేసింది. దానికి నేను ఈ అవార్డు గురించి నేను ఎప్పుడూ వినలేదు.. కానీ నీకు అవార్డు రావడం చాలా గొప్ప విషయం అభినందనలు అని రిప్లై ఇచ్చాను. అప్పటి నుంచి గొడవ స్టార్ట్ చేసింది. అవార్డు గురించి వినలేదా? నీకు అంత చులకనా అవార్డు అంటే? నువ్వు పురుష అహంకారివి అంటూ గొడవపెట్టుకుంది” అంటూ చెప్పుకొచ్చాడు అభినవ్.

ఇక ఆమె అలా మాట్లాడుతుండటంతో.. రిప్లై ఇవ్వడం మానేశాని తెలిపాడు అభినవ్ గోమటం. ఆ అవార్డు గురించి నాకు తెలీదు అన్న మాటకు.. మా చాటింగ్ మెుత్తం స్క్రీన్ రికార్డు తీసి.. ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది. అయితే నెటిజన్లు కూడా అతడు అన్న దాంట్లో తప్పేముంది అంటూ కామెంట్స్ చేసినట్లు అతడు పేర్కొన్నాడు. ఆ ఒక్క మెసేజ్ తో ఇంత రాద్దాంతం జరిగిందని చెప్పుకొచ్చాడు అభినవ్ గోమటం. అంతే తప్ప ఆమెతో ఎలాంటి ప్రేమాయణాలు లేవని స్పష్టం చేశాడు. కాగా.. గతంలో కూడా కల్పిక చిత్రపరిశ్రమలోని ఎంతో మందిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetpark girişgrandpashabet