iDreamPost
android-app
ios-app

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ డాన్ లీ స్టోరీ ఇదే..

  • Published Nov 14, 2024 | 3:09 PM Updated Updated Nov 14, 2024 | 3:09 PM

Don lee: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాన్ లీ. ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబో రానున్న సెన్సేషనల్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాలో డాన్ లీ విలన్ గా కనిపించబోతున్నాడని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా మరో వార్తా ఇంకాస్త వైరల్ అయింది. దీనితో అసలు ఎవరు ఈ డాన్ లీ? ఎందుకు ఇంత ట్రెండ్ అవుతున్నాడు అని అతని గురించి తెలుసుకోవడం కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు.

Don lee: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాన్ లీ. ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబో రానున్న సెన్సేషనల్ మూవీ 'స్పిరిట్'. ఈ సినిమాలో డాన్ లీ విలన్ గా కనిపించబోతున్నాడని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా మరో వార్తా ఇంకాస్త వైరల్ అయింది. దీనితో అసలు ఎవరు ఈ డాన్ లీ? ఎందుకు ఇంత ట్రెండ్ అవుతున్నాడు అని అతని గురించి తెలుసుకోవడం కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు.

  • Published Nov 14, 2024 | 3:09 PMUpdated Nov 14, 2024 | 3:09 PM
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ డాన్ లీ స్టోరీ ఇదే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాన్ లీ. ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబో రానున్న సెన్సేషనల్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాలో డాన్ లీ విలన్ గా కనిపించబోతున్నాడని ఎప్పటినుంచో టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా మరో వార్తా ఇంకాస్త వైరల్ అయింది. తాజాగా ఆయన ఇంస్టాగ్రామ్ లో సలార్2 ఫ్యాన్ మేడ్ పోస్టర్ పెట్టి థంబ్ ఎమోజి షేర్ చేశాడు. దీనితో అతను సలార్ 2 లో భాగం కాబోతున్నాడని టాక్ జోరుగా నడిచింది. ప్రభాస్, డాన్ లీ కాంబినేషన్ లో మూవీ కన్ఫర్మ్ అని అటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా టాక్ వినిపిస్తుంది. మరి డాన్ లీ సలార్ లో చేస్తాడో.. స్పిరిట్ లో చేస్తాడో తెలియదు కానీ ఇతని పేరు మాత్రం సోషల్ మీడియాలో తెగ సౌండ్ చేస్తుంది. దీనితో అసలు ఎవరు ఈ డాన్ లీ? ఎందుకు ఇంత ట్రెండ్ అవుతున్నాడు అని అతని గురించి తెలుసుకోవడం కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ డాన్ లీ ఎవరంటే.. బేసిక్ గా ఇతను సౌత్ కొరియాకు చెందిన వ్యక్తి. అతను 19 ఏళ్ళ వయస్సులో అమెరికా వెళ్లి 10 ఏళ్ళు అక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. తర్వాత కొంతకాలం అక్కడే ట్రైనర్ గా వర్క్ చేశాడు. ఆ తర్వాత . 2004లో ‘డాన్స్ విత్ ది వింగ్’ అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చాడు. మొదట కొరియన్ భాషలోనే ఓ నటుడిగా అతను కెరీర్ ను స్టార్ట్ చేశాడు.

ఈ క్రమంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించాడు డాన్ లీ. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ హీరోగా మారాడు. 2012 లో ‘ది నైబర్స్’ సినిమాతో బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డును కూడా అందుకున్నాడు డాన్ లీ. అలాగే 2016లో చేసిన ‘ట్రైన్ అండ్ బుసాన్’ కూడా అతనికి ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్ తీసుకువచ్చింది. ఇక అప్పటినుంచి కూడా అనేక రకాల విభిన్న పాత్రలను చేస్తూ హాలీవుడ్ స్థాయి వరకు ఎదిగాడు. హాలీవుడ్ లో 2021 లో మార్వెల్ సిరీస్ నుంచి ‘ఎటర్నల్’ అనే మూవీ వచ్చింది. ఈ సినిమాలో డాన్ లీ ఓ సూపర్ హీరో రోల్ లో నటించాడు. ఈ సినిమాతో అతనికి వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు వచ్చింది. . చివరిగా ఈ ఏడాది ‘ది రౌండ్ అప్ పనిష్మెంట్’ అనే సినిమాలో కనిపించాడు. డాన్ లీ అసలు పేరు లీ డాంగ్ సియోక్. అతని వయస్సు 53 ఏళ్ళు. ఇప్పుడు దాదాపు స్పిరిట్ లోనే డాన్ లీ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో అతను నటిస్తే కనుక కచ్చితంగా ప్రభాస్ , డాన్ లీ కాంబినేషన్ సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ పండితుల అంచనా. ఈ సినిమా 2000 కోట్లు వసూళ్లు చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నారు.

స్పిరిట్ సినిమా మీద ఇలాంటి అప్డేట్స్ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నారు. ఇప్పటివరకు ఏ సినిమాలోనూ ఇలాంటి హాలీవుడ్ యాక్టర్స్ నటించలేదు. అలాంటిది ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ చాలా పకడ్బందీగా ఇలాంటి వారిని రంగంలోకి దించుతున్నాడు. అసలు సందీప్ ప్లానింగ్ ఏంటో తెలియదు కానీ.. ఇది కచ్చితంగా వరల్డ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే సినిమా అని మాత్రం అర్ధమౌతుంది. అసలే సందీప్ క్యారెక్టర్స్ ను చాలా లోతుగా డిసైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇతని చేతిలో ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. ఈ ఇద్దరినీ స్క్రీన్ మీద ఎలా చూపిస్తాడు అనేదే అందరి క్యూరియాసిటీ. ఇది సరిగ్గా ఎప్పటికి కంప్లీట్ అవుతుందో తెలియదు కానీ.. కచ్చితంగా ఇది థియేటర్స్ తగలపడిపోయే మెంటల్ మాస్ మూవీ అని.. మూవీ లవర్స్ మధ్య డిస్కషన్స్ జరుగుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom