iDreamPost
android-app
ios-app

ఒకేసారి 6 లగ్జరీ అపార్ట్ మెంట్స్ కొన్న స్టార్ హీరో! వాటి ధర తెలిస్తే షాకే..

  • Published Jun 19, 2024 | 11:25 AM Updated Updated Jun 19, 2024 | 11:25 AM

ఓ స్టార్ హీరో ఒకేసారి ఏకంగా 6 అపార్ట్ మెంట్స్ ను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మరి ఆ హీరో ఎవరు? వాటి ధర ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ స్టార్ హీరో ఒకేసారి ఏకంగా 6 అపార్ట్ మెంట్స్ ను కొనుగోలు చేశాడు. ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మరి ఆ హీరో ఎవరు? వాటి ధర ఎంత? ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Jun 19, 2024 | 11:25 AMUpdated Jun 19, 2024 | 11:25 AM
ఒకేసారి 6 లగ్జరీ అపార్ట్ మెంట్స్ కొన్న స్టార్ హీరో! వాటి ధర తెలిస్తే షాకే..

సాధారణంగా సెలబ్రిటీలు ఖరీదైన బంగ్లాలు, కార్లు, ఇతర ప్రాపర్టీస్ కొనడం గురించి మనం వింటూనే ఉంటాయి. ఇక ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోలు, హీరోయిన్లు లగ్జరీ హౌస్ లను కొనుగోలు చేసేశారు. అయితే ఎవరైనా ఒక ఇంటినో లేక ఒక అపార్ట్ మెంట్ నో కొంటారు. కానీ ఈ స్టార్ హీరో మాత్రం ఏకంగా 6 అపార్ట్ మెంట్స్ ను ఒకేసారి కొనుగోలు చేశాడట. అది కూడా రిచ్ ఏరియాలో. ఈ విషయం తెలిసిన అభిమానులు వామ్మో అంటూ.. ముక్కునవేలేసుకుంటున్నారు. ఇంతకీ వాటి ధరెంతో ఎంతో తెలుసా? ఆ హీరో ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సినిమా ఇండస్ట్రీలో ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ హీరో ఏకంగా 6 అపార్ట్ మెంట్స్ ను ఒకేసారి కొన్నాడు. ఆ హీరో మరెవరో కాదు.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్. బాలీవుడ్ లోకి బిగ్ బీ వారసుడిగా అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అభిషేక్ పేరు మారుమోగిపోతోంది. దానికి కారణం అతడు ఒకేసారి ఏకంగా 6 అపార్ట్ మెంట్స్ ను కొనుగోలు చేయడమే. ముంబైలోని బోరివాలి సబర్బన్ ఏరియాలో ఆరు అపార్ట్  మెంట్స్ ను కొన్నాడు అభిషేక్. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఒబేరాయ్ రియాల్టీ అనుబంధ కంపెనీ అయిన ఇంక్లైన్ రియాల్టీ దగ్గర ఈ అపార్ట్ మెంట్స్ కొన్నాడు.

ఒబేరాయ్ స్కై సిటీ లగ్జరీ ప్రాజెక్ట్ లో 57వ అంతస్తులో 4,984 చదరపు అడుగుల విస్తీర్ణం గల అపార్ట్ మెంట్స్ ను సొంత చేసుకున్నాడు. ఇందులో రెండు అపార్ట్ మెంట్స్ 252 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటే.. మిగతావి 1100 అడుగుల ఏరియా కలిగి ఉన్నాయి. ఈ ఆరు అపార్ట్ మెంట్స్ విలువ అక్షరాలా రూ. 15.42 కోట్లు. ఈ అపార్టుమెంట్ల కొనుగోలు ప్రక్రియ గత నెల 28న పూర్తికాగా.. 29న రిజిస్ట్రేషన్ పూర్తయిందని జాప్ కీ డాట్ కామ్ ఓ వార్తా కథనం ప్రచురించింది. అయితే ఈ విషయంపై ఇటు అభిషేక్ బచ్చన్ గానీ, ఒబేరాయ్ రియాల్టీ సంస్థగాని స్పందించలేదు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగంపై విపరీతమైన పెట్టుబడులు పెట్టేందుకు మెుగ్గుచూపుతున్నారు సినీ సెలబ్రిటీలు. అందులో భాగంగానే లగ్జరీ ఇళ్లను, బంగళాలను కొనుగోలు చేస్తున్నారు. మరి అభిషేక్ బచ్చన్ ఒకేసారి 6 అపార్ట్ మెంట్స్ కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş