iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌పై నిర్మాత సెటైర్లు.. ఆమెకు దూరంగా ఉండాలి అంటూ..

సినిమా ప్రమోషన్లకు హీరోయిన్లు వస్తూ ప్రొజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొంత మంది సినిమా చేశామా లేదా అన్నట్లుగా ఉంటారు. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ఓ నటిపై సెటెర్స్ వేశాడు నిర్మాత.

సినిమా ప్రమోషన్లకు హీరోయిన్లు వస్తూ ప్రొజెక్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ కొంత మంది సినిమా చేశామా లేదా అన్నట్లుగా ఉంటారు. ఇది నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ఓ నటిపై సెటెర్స్ వేశాడు నిర్మాత.

హీరోయిన్‌పై నిర్మాత సెటైర్లు.. ఆమెకు దూరంగా ఉండాలి అంటూ..

24 క్రాప్టులపై ఆధారపడి నడుస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. అయితే ఈ మూవీకి హీరో హీరోయిన్లు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లు ఎంత ముఖ్యమో.. ప్రొడ్యూసర్ కూడా అంతే ముఖ్యం. సినిమాను పోషించేది నిర్మాతే. నిర్మాత లేకపోతే సినిమా లేదని చెప్పొచ్చు. అప్పు చేసి మరీ సినిమాలు తీస్తుంటారు. ఒక మూవీ ప్లాపైతే.. నటీనటులకు, టెక్నీషియన్లు మరో చోట అవకాశం కలుగుతుంది కానీ.. నిర్మాతకు డబ్బులు రాకపోతే.. మరో సినిమా తీయడం పక్కన పెడితే.. అప్పులు పాలు కావాల్సిందే. అందుకే అత్యంత రిస్క్ చేసేది ఎవరంటే నిర్మాత. సినిమాపై నమ్మకాన్ని ఉంచి మూవీస్ తెరకెక్కిస్తుంటాడు. సినిమా స్టార్ అయ్యే దగ్గర నుండి థియేటర్ వచ్చే వరకు ఓ టెన్షన్ ఉంటే.. ఆ తర్వాత మరో టెన్షన్ ఉంటుంది. సినిమాకు కలెక్షన్స్ వస్తాయా లేదా అని కంటిమీద కునుకు కూడా ఉండదు.

కానీ ఇటీవల కాలంలో కొంత మంది నిర్మాతలు సినిమాల పరంగా కన్నా హీరోయిన్ల విషయంలో చాలా ఇబ్బందులకు గురౌతున్నారు. ముఖ్యంగా కొత్త నిర్మాతలు, చిన్న నిర్మాతలు వేదన వర్ణనాతీతం. సినిమా ప్రమోషన్లకు రమ్మంటే రాకుండా హీరోయిన్లు మొండికేస్తుండటంతో వారికి పెద్ద తలనొప్పి తయారయ్యింది. తాజాగా ఓ హీరోయిన్ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. చివరకు ఇలాంటి హీరోయిన్ చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటే నిర్మాతలకు మంచిదని సెటేర్లు వేశాడో ప్రొడ్యూసర్. ఇంతకు ఆ నటి ఎవరంటే కోలీవుడ్ బ్యూటీ అబర్నతి. ఆమె తాజాగా నటించిన మూవీ నరకప్పర్. ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్లకు హాజరు కావాలని నిర్మాత సురేశ్ కామాక్షి కోరగా.. ఆమె డుమ్మా కొట్టింది. మిగిలిన తారాగణం ఉన్నప్పటికీ ఆమె రాకపోవడంపై మండిపడ్డాడు నిర్మాత

ఈ కార్యక్రమంలో నిర్మాత మాట్లాడుతూ ‘ అబర్నతి ప్రమోషన్స్‌కు రావాలంటే రూ. 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంతేకాదు స్టేజీపై ఎవరి పక్కన కూర్చోవాలనేది కూడా ఆమె నిర్ణయించుకుంటానని చెప్పింది. రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి సారీ చెప్పింది. ప్రమోషన్లకు వస్తానని చెప్పింది. కానీ డుమ్మా కొట్టింది. అదేమంటే ఎక్కడో దూరంగా ఉన్నానని చెబుతుంది. ఇలాంటి హీరోయిన్లు ఎంత దూరంగా ఉంటే.. తమిళ ఇండస్ట్రీకి, నిర్మాతలకు అంత మంచిది’ అంటూ నిర్మాత సురేశ్ అన్నాడు. కాగా, తాను ప్రమోషన్ల కోసం అన్ని లక్షలు డిమాండ్ చేశానని చెప్పడం అబద్ధమని,  ఇంకా తన రెమ్యునరేషన్ కూడా పెండింగ్‌లోనే ఉందని చెప్పిందని చెప్పింది అబర్నతి. కాగా అబర్నతి.. జైల్‌, తేన్‌, ఇరుగపట్రు వంటి చిత్రాలతో పాపులర్‌ అయింది. నరకప్పర్‌ ఆగస్టు 9న విడుదలకు సిద్ధమవుతోంది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetmariobetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom