iDreamPost
android-app
ios-app

Aay Movie Collections: రోజురోజుకు పెరుగుతున్న ఆయ్ కలెక్షన్లు! 4వ రోజు ఎన్నికోట్లు కొల్లగొట్టిందంటే?

  • Published Aug 19, 2024 | 10:10 AM Updated Updated Aug 19, 2024 | 11:51 AM

Aay Movie Day 4 Collections: చిన్న చిత్రంగా విడుదలైన ఆయ్ మూవీ.. రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టింది. డే 4 నార్నె నితిన్ ఎంత రాబట్టాడంటే?

Aay Movie Day 4 Collections: చిన్న చిత్రంగా విడుదలైన ఆయ్ మూవీ.. రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ వెళ్తోంది. వరుసగా నాలుగో రోజు కూడా అద్బుతమైన వసూళ్లను రాబట్టింది. డే 4 నార్నె నితిన్ ఎంత రాబట్టాడంటే?

  • Published Aug 19, 2024 | 10:10 AMUpdated Aug 19, 2024 | 11:51 AM
Aay Movie Collections: రోజురోజుకు పెరుగుతున్న ఆయ్ కలెక్షన్లు! 4వ రోజు ఎన్నికోట్లు కొల్లగొట్టిందంటే?

మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా ఆదరిస్తారని మరోసారి ‘ఆయ్’ మూవీ రుజువు చేసింది. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ డబుల్ ఇస్మార్ట్, విక్రమ్ తంగలాన్ లాంటి భారీ సినిమాల మధ్యలో చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం ఊహించని విజయాన్ని దక్కించుకుంది. తొలిరోజు నుంచే పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్లిన ఆయ్.. కలెక్షన్ల పరంగా కూడా దుమ్మురేపుతోంది. తొలి మూడు రోజులకు మించి నాలుగో రోజు అద్భుతమైన వసూళ్లను సాధించింది. 4వ రోజు ఈ సినిమాకు ఎన్నికోట్లు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.

‘ఆయ్’.. ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్ గా డైరెక్టర్ కంచిపల్లి అంజిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ అభిమానుల హృదయాలను కొల్లగొడుతూ ముందుకు సాగుతోంది. తొలి మూడు రోజుల్లో మంచి వసూళ్లను రాబట్టిన నితిన్.. అదే జోరును 4వ రోజు కూడా చూపించాడు. మూడో రోజు కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టింది. మూడో రోజు రూ. 1.20 కోట్లు సాధించిన ఆయ్.. నాలుగో రోజు రూ. 1.46 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో టోటల్ గా నాలుగు రోజుల్లో కలిపి ఆయ్ మూవీ రూ. 4.51 కోట్లను  కొల్లగొట్టి.. మంచి జోరుమీదుంది.

aay movie day 4 collections

కాగా.. ఇదే జోరును కొనసాగిస్తే.. మరికొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను కొట్టేయం ఖాయంగా కనిపిస్తోంది. ఆయ్ మూవీని GA2 పిక్చర్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్య కప్పినీడి కలిసి నిర్మించారు. విడుదలైన రోజు నుంచి రోజు రోజుకు ఈ చిత్రం కలెక్షన్లు పెరుగుతున్నాయే.. తప్ప తగ్గడం లేదు. మరి ఆయ్ మూవీ డే 4 కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom