iDreamPost
android-app
ios-app

Aaradhya Bachchan: అచ్చం తల్లిలాగే.. యాక్టింగ్‌ అదరగొట్టిన ఆరాధ్య బచ్చన్‌!

  • Published Dec 16, 2023 | 6:33 PM Updated Updated Dec 16, 2023 | 6:33 PM

ఆరాధ్య రాయ్‌ బచ్చన్‌ ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్‌నేషనల్‌ స్కూల్లో చదువుతోంది. నిన్న స్కూలు ఆన్యువల్‌ డే ఫంక్షన్‌ జరిగింది. ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు కూడా హాజరయ్యారు.

ఆరాధ్య రాయ్‌ బచ్చన్‌ ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్‌నేషనల్‌ స్కూల్లో చదువుతోంది. నిన్న స్కూలు ఆన్యువల్‌ డే ఫంక్షన్‌ జరిగింది. ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు కూడా హాజరయ్యారు.

  • Published Dec 16, 2023 | 6:33 PMUpdated Dec 16, 2023 | 6:33 PM
Aaradhya Bachchan: అచ్చం తల్లిలాగే.. యాక్టింగ్‌ అదరగొట్టిన ఆరాధ్య బచ్చన్‌!

స్టార్‌ కిడ్స్‌కు పుట్టుకతోనే సెలెబ్రిటీ స్టాటస్‌ వచ్చేస్తుంది. వాళ్లు ఏం చేసినా.. అది న్యూస్‌ అవుతుంటుంది. సోషల్‌ మీడియా పెరిగిపోయిన తర్వాత సెలెబ్రిటీ పిల్లలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి. తాజాగా, ప్రముఖ స్టార్‌ దంపతుల జంట ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ల కూతురు ఆరాధ్య బచ్చన్‌ల వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఆరాధ్య యాక్టింగ్‌కు సంబంధించిన వీడియో.

ఆరాధ్య ముంబైలోని ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్‌నేషనల్‌ స్కూల్లో చదువుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఆ స్కూల్‌ ఆన్యువల్‌ డే ఫంక్షన్‌ జరిగింది. ఈ ఫంక్షన్‌కు ఆరాధ్య తల్లిదండ్రులు ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు కూడా హాజరయ్యారు. పంక్షన్‌ సందర్భంగా ఆరాధ్య ఓ నాటకం వేశారు. అది ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్‌నేషనల్‌ స్కూల్‌కు సంబంధించిన యాడ్‌లా అనిపిస్తోంది. ఆరాధ్య గుక్క తిప్పుకోకుండా ఎంతో అవలీలగా.. పెద్ద పెద్ద డైలాగులు చెప్పింది. యాక్టింగ్‌లో తల్లిదండ్రులను తలదన్నేలా అనిపించింది.

ఇక, ఈ వీడియోను సినిమా జర్నలిస్ట్‌ క్రిస్టోఫర్‌ కనగరాజ్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. వీడియో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఐశ్వర్య రాయ్‌ కూతురా అక్కడున్నది. ఇంతలో ఎంత ఎదిగిపోయింది’’.. ‘‘ ప్రస్తుతం బాలీవుడ్‌లో ఉన్న కొంతమంది స్టార్‌ హీరోయిన్ల కన్నా చాలా అద్భుతంగా నటిస్తోంది’’.. ‘‘ యాక్టింగ్‌లో తల్లిని మించిపోయేలా ఉంది’’.. ‘‘ ఎంతైనా బిగ్‌బీ కుటుంబం కదా.. ఆ మాత్రం యాక్టింగ్‌ చేయకపోతే బాగుండదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా, ఐశ్వర్య రాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌ విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. అంతేకాదు! ఐశ్వర్య తన కూతురు ఆరాధ్యతో అభిషేక్‌కు దూరంగా.. వేరే ఇంట్లో ఉంటోందని కూడా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలో వీరిద్దరూ తమ విడాకుల విషయాన్ని బయటకు చెప్పే అవకాశం కూడా ఉందన్న ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారానికి నిన్నటితో కొంత బ్రేక్‌ పడింది. ధీరూభాయ్‌ అంబానీ ఇంటర్‌నేషనల్‌ స్కూల్లో జరిగిన ఆన్యువల్‌ డే ఫంక్షన్‌కు ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌లు కలిసి వచ్చారు.

ఇద్దరూ స్కూల్లోకి కలిసి వెళ్లిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పుకార్లకు బ్రేక్‌ పడి నట్లు అయింది. అయితే, ఐశ్వర్య కారులోంచి బయటకు వచ్చిన తర్వాత అభిషేక్‌ పై అసహనం వ్యక్తం చేసిన మరో వీడియో కూడా వైరల్‌ అయింది. కూతురి ఫంక్షన్‌ కోసం మాత్రమే వారు కలిసి వచ్చారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి, ఆరాధ్య యాక్టింగ్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet