iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో విషాదం: త్రీ ఇడియట్ నటుడు కన్నుమూత

  • Published Sep 21, 2023 | 1:29 PM Updated Updated Sep 21, 2023 | 1:29 PM
  • Published Sep 21, 2023 | 1:29 PMUpdated Sep 21, 2023 | 1:29 PM
ఇండస్ట్రీలో విషాదం: త్రీ ఇడియట్ నటుడు కన్నుమూత

సినీ పరిశ్రమ ఈ ఏడాది అనేక మంది ప్రముఖులను కోల్పోయింది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు అనేక మంది మరణించారు. ఈ నెలలో జైలర్ నటుడు, డైరెక్టర్ జి మారి ముత్తు మరణించిన సంగతి విదితమే. బాలీవుడ్ బీర్బల్, షోలే ఫేమ్ నటుడు సతీందర్ కుమార్ ఖోస్లా మృతి చెందిన సంగతి విదితమే. చక్ దే ఇండియా ఫేమ్ రియో కపాడియా కూడా మరణించారు. తాజాగా బాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. అమీర్ ఖాన్ సూపర్ హిట్ మూవీ త్రీ ఇడియట్స్ నటుడు ప్రమాదానికి గురై మరణించారు. ఈ వార్త హిందీ పరిశ్రమలో పెను విషాదాన్ని నింపింది.

బాలీవుడ్ నటుడు త్రీ ఇడియట్స్‌లో లైబ్రేరియన్ దూబే పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు అఖిల్ మిశ్రా(58) మరణించారు. తన ఇంటి వంట గదిలో పనిచేస్తూ.. జారి పడ్డారు. దీంతో గాయాలైన చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన భార్య, జర్నన్ నటి సుజానే బెర్నెర్ట్ ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆమె షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ లో ఉండగా.. ఈ విషయం తెలిసి ఆమె తిరిగి పయనమైంది. తన హృదయం ముక్కలైందని, తన సగం పోయిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అఖిల్ భన్వార్, ఉత్తరాన్, ఉడాన్, సీఐడి, శ్రీమాన్ శ్రీమతి, హతీమ్ వంటి టెలివిజన్ షోల్లో కనిపించారు. డాన్, గాంధీ, మై ఫాదర్, శిఖర్, కమ్లా కీ మౌత్, వెల్ డన్ అబ్బా వంటి చిత్రాల్లో కనిపించారు. సినీ & టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (CINTAA) అఖిల్ మిశ్రా మరణంపై X (గతంలో ట్విట్టర్ )లో తన సంతాపాన్ని వ్యక్తం చేసింది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom