iDreamPost
android-app
ios-app

ప్రేమ కావాలి హీరోయిన్‌ని మర్చిపోగలమా? మళ్లీ 10 ఏళ్ల తర్వాత..

  • Published Aug 28, 2024 | 4:58 PM Updated Updated Aug 28, 2024 | 4:58 PM

Prema Kavali: సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం ప్రేమ కావాలి. ఇందులో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఉన్నపళంగా సినిమాల నుండి దూరమైన ఈమె. . పదేళ్ల తర్వాత..

Prema Kavali: సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హీరోగా నటించిన తొలి చిత్రం ప్రేమ కావాలి. ఇందులో నటించిన ముద్దుగుమ్మ గుర్తుందా.? ఉన్నపళంగా సినిమాల నుండి దూరమైన ఈమె. . పదేళ్ల తర్వాత..

  • Published Aug 28, 2024 | 4:58 PMUpdated Aug 28, 2024 | 4:58 PM
ప్రేమ కావాలి హీరోయిన్‌ని మర్చిపోగలమా? మళ్లీ 10 ఏళ్ల తర్వాత..

విలక్షణ నటుడు సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయి కుమార్. ప్రేమ కావాలి అంటూ 2011లో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రముఖ దర్శకుడు విజయ్ భాస్కర్ డైరెక్టర్‌గా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అనూప్ రూబెన్స్ అందించిన సాంగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీతోనే సినీ కెరీర్ స్టార్ చేసింది ఢిల్లీ డాల్ ఇషా చావ్లా. చక్కటి ఫేస్ కట్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ.. తక్కువ కాలంలోనే క్లిక్ అయ్యింది. ఇప్పటి వరకు ఆరు సినిమాలు తీస్తే.. ఐదు తెలుగు సినిమాలే. ఒక్కటంటే ఒక్కటే కన్నడ చిత్రం. 2014లో తెలుగులో మూవీ చేసి కనిపించకుండా పోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అతి పెద్ద మూవీతో కంబ్యాక్ ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇంతకు ఆ మూవీ ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకుడిగా తెరకెక్కుతోన్న విశ్వంభరలో నటించబోతుంది.

వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలబోతున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణన్, మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, సురభితో పాటు ఇషా వంటి ముద్దుగుమ్మలు నటించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అంటే ఇంచు మించు పదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది. ఢిల్లీలో పుట్టిన ఇషా చావ్లా. పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి.. యాక్టింగ్‌ను ఫ్యాషన్‌గా ఎంచుకుంది. ముంబయిలో యాక్టింగ్ కోర్స్ తీసుకుంటున్న సమయంలో ఆదిని హీరోగా పరిచయం చేస్తూ.. విజయ్ భాస్కర్ తెరకెక్కించిన ప్రేమ కావాలి చిత్రంలో నటించి.. కుర్రకారు మనస్సు దోచేసుకుంది. ఇందులో ఆమె నటనకు సిని ‘మా’అవార్డులో భాగంగా మోస్ట్ ప్రామెసింగ్ ఫేస్ అవార్డును సైతం గెలుచుకుంది.

ప్రేమ కావాలి మూవీ తర్వాత సునీల్ హీరోగా వచ్చిన పూలరంగడు చిత్రంలో నటించింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో అనిత పాత్రలో కనిపించింది. బాలకృష్ణ హీరోగా వచ్చిన శ్రీమన్నారాయణ చిత్రంలో మెరిసింది. మళ్లీ సునీల్ సరసన. .మిస్టర్ పెళ్లికొడుకు చిత్రంలో యాక్ట్ చేసింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ప్రముఖ డైరెక్టర్ ఈ సత్తిబాబు దర్శకత్వంలో జంప్ జిలానీ మూవీలో అల్లరి నరేష్‌తో జతకట్టింది. ఇది కూడా బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది.  2016లో దర్శన్ హీరోగా వచ్చిన విరాట్ అనే కన్నడ చిత్రంలో కనిపించింది. తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఆమె మళ్లీ ఇప్పుడు విశ్వంభరతో టాలీవుడ్ ప్రేక్షకులను కనువిందు చేసేందుకు వచ్చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Esha Chawla (@eshachawla63)

Jojobet Girişjojobet güncel girişMadridbetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet