iDreamPost
android-app
ios-app

#90’s డైరెక్టర్ తో నితిన్ మూవీ.. బాగా కలిసొచ్చిన జానర్ లో!

  • Published Jan 30, 2024 | 4:27 PM Updated Updated Jan 30, 2024 | 4:27 PM

Aditya Hasan- Nithin Movie: మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తో ఆదిత్య హాసన్ మంచి డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా 2 సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.

Aditya Hasan- Nithin Movie: మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తో ఆదిత్య హాసన్ మంచి డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా 2 సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు.

  • Published Jan 30, 2024 | 4:27 PMUpdated Jan 30, 2024 | 4:27 PM
#90’s డైరెక్టర్ తో నితిన్ మూవీ.. బాగా కలిసొచ్చిన జానర్ లో!

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో యంగ్ టాలెంట్ కి కొదవ లేదు. కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది. అలా తాజాగా ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్. #90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అంటూ అద్భుతమైన వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. ఈ సిరీస్ తో వాసుఖీ, శివాజీ తమ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఎంత ఎక్కేసింది అంటే.. ఆ క్యారెక్టర్స్ లో తమని తాము చూసుకుంటూ ఇదే కదా మన లైఫ్ అంటూ అప్పటి రోజులను నెమరు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసారి ఏకంగా యంగ్ హీరో నితిన్ తో తన సినిమాని చేయబోతున్నాడు.

యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతని డెబ్యూ వెబ్ సిరీస్ #90’s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ కి ఆ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ ఇంట్లో ఈ వెబ్ సరీస్ ని రిపీటెడ్ గా చూసేస్తున్నారు. ఈ సిరీస్ రిలీజ్ అయిన తర్వాత ఆదిత్య హాసన్ ఎంత బిజీ అయిపోయాడో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ నుంచి చోటా మోటా హీరోల నుంచి బడా స్టార్ల వరకు అందరూ ఆదిత్య హాసన్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కొందరైతే పొగడ్తలతో ఆగిపోకుండా సినిమా ఛాన్సులు కూడా ఇస్తున్నారు. వారిలో నితిన్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.

ఇప్పటికే హీరో నితిన్ తో పలుమార్లు భేటీ అయిన ఆదిత్య హాసన్ సినిమాకి ఓకే చేయించుకున్నాడని తెలుస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని తెలుస్తోంది. శ్రేష్ఠ్ మూవీస్ అంటే నితిన్ సొంత బ్యానర్. దాదాపుగా ఈ సినిమా పక్కా అయిపోయినట్లేనని నెట్టింట టాక్ గట్టిగానే నడుస్తోంది. అలాగే ఈ మూవీ ఏ జానర్ లో ఉంటుందో కూడా ఓ క్లారిటీ వచ్చింది. ఐడ్రీమ్ కి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆదిత్య హాసన్ తన నెక్ట్స్ సినిమాపై మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు. అదేంటంటే.. ప్రస్తుతం ఏదైతే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేశారో.. అది పోకుండా అలాంటి జానర్ లోనే తన తర్వాతి సినిమాని ప్లాన్ చేస్తున్నాని చెప్పాడు. కచ్చితంగా ఒక క్యూట్ లవ్ స్టోరీని మరింత పకడ్బందీగా రాసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ చెప్పాడు.

నితిన్ తో తన తర్వాతి సినిమా అనగానే అది కచ్చితంగా లవ్ స్టోరీ అనే విషయం అయితే అర్థమవుతోంది. అయితే హీరోయిన్ ఎవరు? సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. ఇప్పటికే శ్రేష్ఠ్ మూవీస్ నుంచి ఆదిత్య హాసన్ కు అడ్వాన్స్ కూడా అందేసింది అంటూ ఫిల్మ్ వర్గాల్లో గుసగుసలు మొదలయ్యాయి. ఈ మూవీ మాత్రమే కాకుండా.. ఆదిత్య హాసన్ కు ఇంకో సినిమా ఆఫర్ కూడా వచ్చిందని చెబుతున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా ఆదిత్య హాసన్ ఒక సినిమా చేయబోతున్నాడు అని టాక్ నడుస్తోంది. నితిన్ సినిమా అయ్యాక ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని తెలుస్తోంది. అయితే హీరో ఎవరు అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరి.. నితిన్- ఆదిత్య హాసన్ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaymavi girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom