iDreamPost
android-app
ios-app

#90’s వెబ్ సిరీస్ అమ్మాయి అప్పుడే హీరోయిన్ రేంజ్ లో! గుర్తు కూడా పట్టలేరు!

#90's A Middle Class Biopic Fame Vasanthika Macha: తెలుగు ఓటీటీ ప్రేక్షకులు అంతా 90స్ వెబ్ సిరీస్ ని అస్సలు మర్చిపోలేరు. ఒక్క సిరీస్ తో నవ్వించారు, ఏడిపించారు, ఆలోచింపజేశారు, మన చిన్ననాటి జ్ఞాపకాలను కళ్ల ముందు మెదిలేలా చేశారు. ఈ సిరీస్ తో వాసంతికాకు మంచి గుర్తింపు లభించింది.

#90's A Middle Class Biopic Fame Vasanthika Macha: తెలుగు ఓటీటీ ప్రేక్షకులు అంతా 90స్ వెబ్ సిరీస్ ని అస్సలు మర్చిపోలేరు. ఒక్క సిరీస్ తో నవ్వించారు, ఏడిపించారు, ఆలోచింపజేశారు, మన చిన్ననాటి జ్ఞాపకాలను కళ్ల ముందు మెదిలేలా చేశారు. ఈ సిరీస్ తో వాసంతికాకు మంచి గుర్తింపు లభించింది.

#90’s వెబ్ సిరీస్ అమ్మాయి అప్పుడే హీరోయిన్ రేంజ్ లో! గుర్తు కూడా పట్టలేరు!

ఓటీటీల్లో #90’s వెబ్ సిరీస్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సిరీస్ తో శివాజీ- వాసుఖీ సక్సెస్ ఫుల్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆదిత్య హాసన్ కు మంచి డైరెక్టర్ గా గుర్తింపు, అవకాశాలు లభించాయి. ఇంక ఈ సిరీస్ లో చేసి ప్రతి ఒక్క యాక్టర్ కి మంచి అప్లాజ్, అవకాశాలు లభించాయి. వారిలో ప్రముఖంగా వినిపించే పేరు శివాజీ కుమార్తెగా చేసిన వాసంతికా మచ్చ. ఈమెకు తెలుగులో మంచి గుర్తింపే ఉంది. ఈ వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత అది రెట్టింపు అయ్యింది. అలాగే సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. అలాగే షోస్, ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు అంటూ ఫుల్ బిజీగా కూడా మారిపోయింది.

వాసంతికా మచ్చాకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత ఎన్నో మంచి మంచి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మెప్పించింది. అయితే ఆ మూవీస్ వచ్చిన తర్వాత ఫొటో చూస్తే వాసంతికను గుర్తు పట్టేస్తారు. కానీ, ఎప్పుడైతే 90స్ వెబ్ సిరీస్ లో వాసంతిక నటించిందో.. తన నటనతో అదరగొట్టి తెలుగు ప్రేక్షకుల మన్నలు పొందిందో.. అప్పటి నుంచి వాసంతికా అనే పేరు చెప్పగానే గుర్తు పట్టేస్తున్నారు. తన నటనతో అటు ప్రేక్షకులనే కాదు.. డైరెక్టర్, సీనియర్ ఆర్టిస్టులను కూడా మెస్మరైజ్ చేసింది. వెబ్ సిరీస్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ అయితే వాసంతికను సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ పొగిడేస్తూ ఉంటాడు.

ఈ వెబ్ సిరీస్ లో ఒక మిడిల్ క్లాస్ టీచర్ తండ్రికి కుమార్తెగా ఎంతో బాగా నటించింది. ఒక బ్రిలియంట్ స్టూడెండ్, తల్లిదండ్రులు కోరుకున్న విధంగా ఎంతో కష్టపడి చదివేతత్వం, ఎంతో అమాయకంగా ఎంతో అద్భుతంగా నటించింది. ఆ సిరీస్ తో వాసంతికకు ఇండస్ట్రీలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా మంచి గుర్తింపు, అప్లాజ్ లభించింది. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య అయితే అమాంతం పెరిగిపోయింది. ఒక పోస్ట్ పెడితే వేలల్లో లైక్స్, వందల్లో షేర్స్ వస్తున్నాయి. తాజాగా వాసంతిక గుంటూరు కారం చిత్రంలోని క్రేజీ క్రేజీ క్రేజీ ఫర్ యూ సాంగ్ కు డ్యాన్స్ వేస్తూ ఒక రీల్ చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చేసిన రీల్ ఫుల్ వైరల్ అయిపోయింది. అది చూసిన ఫ్యాన్స్ ఏంటి 90స్ సిరీస్లో ఉన్న వాసంతిక.. అప్పుడే ఇంత పెద్ద అమ్మాయి అయిపోయిందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. సిరీస్ లో ఆమెను స్కూల్ యూనిఫామ్ లో చూసిన ఆడియన్స్ ఇప్పుడు చీరలో చూడగానే తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. అంతేకాకండా వాసంతిక క్లాసికల్ డ్యాన్సర్ కూడా. యాక్టర్ గానే కాకుండా.. డ్యాన్సర్ గా కూడా ఇరగదీస్తూ ఉంటుంది. ఈ రీల్ చూసిన తర్వాత త్వరలోనే వాసంతికను హీరోయిన్ గా స్క్రీన్ మీద చూడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. వాసంతిక చేసిన ఈ రీల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş