iDreamPost
android-app
ios-app

సీక్వెల్ కి సిద్ధమైన ‘బృందావన కాలనీ’! ఈసారి హీరోయిన్ ఎవరంటే..

  • Author ajaykrishna Updated - 01:11 PM, Fri - 28 July 23
  • Author ajaykrishna Updated - 01:11 PM, Fri - 28 July 23
సీక్వెల్ కి సిద్ధమైన ‘బృందావన కాలనీ’! ఈసారి హీరోయిన్ ఎవరంటే..

ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో ఒకటి ”7/G బృందావన కాలనీ’. 18 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చిన ఈ సినిమా.. ఇప్పటికి సౌత్ ఇండియన్ ప్రేక్షకులకు ఫేవరేట్ మూవీనే. దర్శకుడు సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీలో.. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించారు. యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమాతో.. అటు రవికృష్ణ, సోనియాలకు సూపర్ స్టార్డమ్ తీసుకొచ్చిందని చెప్పాలి. ఆ టైమ్ లో బృందావన కాలనీ.. లవ్ స్టోరీస్ కి ట్రెండ్ సెట్టర్. ఇప్పటికి 90స్ కిడ్స్ పై ఈ సినిమా ప్రభావం అలాగే ఉంది.

ఇక ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్ మూవీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అదే బాటలో ఇప్పుడు బృందావన కాలనీ సీక్వెల్ కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. అయితే.. 1ఏళ్ళ తర్వాత రాబోతున్న ఈ సీక్వెల్ లో.. హీరోగా రవికృష్ణనే నటించనున్నాడట. అప్పట్లో బృందావన కాలనీతో హీరోగా ప్రశంసలు అందుకున్న రవికృష్ణ.. తర్వాత పలు సినిమాల్లో నటించినా ప్లాప్స్ తో నిలదొక్కుకోలేకపోయాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత రెడీ అవుతున్న సీక్వెల్ లో మళ్లీ రవికృష్ణనే నటిస్తాడని కోలీవుడ్ వర్గాల టాక్.

ఇదిలా ఉండగా.. బృందావన కాలనీ అనగానే అందరికీ ముందుగా రవికృష్ణ పేరే గుర్తొస్తుంది. అంతలా తన పాత్రలో ఒదిగిపోయాడు. అయితే.. ఇప్పుడు సీక్వెల్ లో కూడా అతన్ని పెడితేనే బాగుంటుందని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం రవి ఈ సీక్వెల్ కోసం సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక హీరో ఎలాగో రవినే కాబట్టి.. హీరోయిన్ ఎవరా? అనే సందేహాలు మొదలైపోయాయి. ఎందుకంటే.. సోనియా అగర్వాల్ ప్రెజెంట్ వయసు పెరిగిపోయి.. సైడ్ క్యారెక్టర్స్ చేస్తోంది. ఇప్పుడు సోనియా బదులు వేరే హీరోయిన్ ను వెతుకుతున్నారట మేకర్స్. తాజా సమాచారం ప్రకారం.. ఈ మధ్య ‘లవ్ టుడే’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇవానా లేదా మహావీరుడు మూవీతో సక్సెస్ లో ఉన్న అతిథి శంకర్ ని తీసుకునే ఆలోచన చేస్తున్నారట. మరి హీరోయిన్ గా ఎవరిని ఫైనల్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సీక్వెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş