Swetha
ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రానున్న మూవీ స్పిరిట్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి ఆన్సర్ ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ చాలా సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఓ షో లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో స్పిరిట్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రానున్న మూవీ స్పిరిట్. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి ఆన్సర్ ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఇప్పటికే ప్రభాస్ చాలా సినిమాలతో బిజి బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఓ షో లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో స్పిరిట్ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కానుందని.. ఆల్రెడీ 70% కంప్లీట్ అయిందని చెప్పుకొచ్చాడు. అదేంటి ప్రభాస్ లేకుండా 70% ఎలా కంప్లీట్ అవుతుంది అని అనుకుంటున్నారా.. అసలు సందీప్ ఏమి అన్నారంటే
“ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 70శాతం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేశాం. గతంలో యానిమల్ సినిమా సమయంలో కూడా షూటింగ్ కంటే ముందే 80శాతం బీజీఎమ్ వర్క్ పూర్తి చేసి.. ఆ తర్వాతే సెట్స్ మీదికి వెళ్లాం. ఇలా చేయడంలో వల్ల సీన్ ఎలాంటి ఔట్‌పుట్ వస్తుందో తెలిసిపోతుంది. ఆపై సమయంతో పాటు ప్రొడక్షన్ వర్క్ కూడా చాలా తగ్గుతుంది. ప్రభాస్‌తో నాకు చాలా సన్నిహితం ఉంది. నేను ఊహించిన దానికంటే చాలా ఎక్కువగానే ఈ సినిమాకు సహకరించారు. పాన్ ఇండియా రేంజ్ హీరో అనే ఫీలింగ్ ఆయనలో కనిపించదు. త్వరలో ప్రభాస్‌తో కలిసే వస్తాం” అంటూ చెప్పుకొచ్చారు సందీప్.
ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారని ఆల్రెడీ టాక్ వినిపిస్తూనే ఉంది. ఇక సినిమాలో స్ట్రాంగ్ ఫ్లాష్ బ్యాక్ ఉందట. ఇదంతా మాఫియా బ్యాక్డ్రాప్ లో ఉంటుందట. ఇప్పటివరకు సందీప్ సినిమాలకు మంచి బ్యాక్గ్రౌండ్ ను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్ కోసం పనిచేస్తున్నారు. ఇక ముందు ముందు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.