iDreamPost
android-app
ios-app

Bollywod: శుభవార్త చెప్పిన 12th Fail హీరో.. తండ్రిగా ప్రమోషన్

  • Published Feb 08, 2024 | 2:20 PM Updated Updated Feb 08, 2024 | 2:20 PM

12th ఫెయిల్ సినిమాతో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మంచి సక్సెస్ ను అందుకున్నా విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విక్రాంత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అయితే తాజాగా విక్రాంత్ తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ని పంచుకున్నాడు. అదేమిటంటే..

12th ఫెయిల్ సినిమాతో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మంచి సక్సెస్ ను అందుకున్నా విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విక్రాంత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది. అయితే తాజాగా విక్రాంత్ తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ని పంచుకున్నాడు. అదేమిటంటే..

  • Published Feb 08, 2024 | 2:20 PMUpdated Feb 08, 2024 | 2:20 PM
Bollywod: శుభవార్త చెప్పిన 12th Fail హీరో.. తండ్రిగా ప్రమోషన్

ఈ మధ్యకాలంలో చిన్న తరహా సినిమాలు కూడా భారీ సక్సెస్ అందుకుంటున్నా సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ లో చాలా సినిమాలు తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి కోట్ల రూపాయలు కలెక్షన్స్ అందుకుంటున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను బాలీవుడ్ కూడా ఫాలో అవుతున్నారు. ఇటీవలే బాలీవుడ్ లో ఓ సినిమా సంచలనం విజయం సాధించింది. ఆ సినిమానే 12th ఫెయిల్. ఇది బాలీవుడ్ లో చిన్న సినిమాగా విడుదలై స్టార్ హీరోల సినిమాలను కూడా క్రాస్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీనిని దర్శకుడు విధు వినోద్ చోప్రా ఓ సాధారణ కథగా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో హీరో విక్రాంత్ మాన్సే నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్న విషయం తెలిసిందే. దీంతో విక్రాంత్ దేశ వ్యాప్తంగా విక్రాంత్ పేరు మారుమోగిపోయింది. అలాగే ఈ సినిమాకు గాను విక్రాంత్.. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ పురస్కారం కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఈయనకు వరుస ఆవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవలే ఓటీటీలో రిలీజైన 12th ఫెయిల్ రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా హీరో విక్రాంత్ తన అభిమానులతో ఓ గుడ్ న్యూస్ ని పంచుకున్నాడు. ఇంతకి అదేమిటంటే..

హీరో విక్రాంత్ మాన్సే 12th ఫెయిల్ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడంతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా విక్రాంత్ తన అభిమానులకు ఓ మంచి శుభవార్తను తెలియజేశాడు. అదేమిటంటే..తాను తండ్రిగా ప్రమోషన్‌ పొందానున్న అని పేర్కొన్నాడు. అవును ఆయన సతిమణి షీతల్ ఠాకూర్ బుధవారం (ఫిబ్రవరి 7)న పండంటి మగబిడ్డను జన్మనిచ్చినట్లు విక్రాంత్‌ తన ఇన్ స్ట్రా గామ్ ఖాతాలో ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. అందులో.. ఈ రోజు (ఫిబ్రవరి 7వ తేదీ 2024) మేమిద్దరం ఒకటయ్యాం. అలాగే మా జీవితాల్లో మరో కొత్త వ్యక్తి వచ్చారు. మాకు కుమారుడు పుట్టాడని చెప్పేందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే పట్టలేనంతా ఆనందం, ప్రేమతో ఉప్పొంగిపోతున్నాం. అంటూ రాసుకోచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విక్రాంత్-షీతల్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే 12th ఫెయిల్‌ సినిమాలో హీరోయిన్‌ మేధా శంకర్‌ కూడా విక్రాంత్‌ పోస్ట్‌ కు స్పందించి.. కంగ్రాట్స్‌ అంటూ విషెస్‌ తెలిపారు.

12th Fail hero who gave good news

ఇక విక్రాంత్ భార్య షీతల్ విషయానికి వస్తే.. ఆమె కూడా పలు సినిమాలు, సిరియల్స్, సిరిస్ లో నటించింది. కాగా, విక్రాంత్ తో కలిసి ఈమె బ్రోకెన్ బుట్ బ్యూటీఫుల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో వీరిద్దరూ.. ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెద్దల అనుమతితో 2022లో పెళ్లిపీటలెక్కారు. ఇక సరిగ్గా ఏడాది తర్వాత మేము అమ్మానాన్నాలు కాబోతున్నాం. నా భార్యవతిని అంటూ షీతల్ బయటపెట్టింది. ఇప్పుడు తమ అన్యోన్య దాంపత్య బంధానికి గుర్తుగా.. పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించారు. మరి, హీరో విక్రాంత్, షీతల్ కు కుమారుడు జన్మించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vikrant Massey (@vikrantmassey)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss