iDreamPost
android-app
ios-app

వీడియో: క్యాబ్ డ్రైవర్‌తో స్టార్ హీరో గొడవ.. డబ్బులు ఎక్కువ అడిగాడని..

  • Published May 09, 2024 | 10:23 PM Updated Updated May 09, 2024 | 10:23 PM

డబ్బులు ఎక్కువ అడిగాడని క్యాబ్ డ్రైవర్ పై గొడవకు దిగాడో స్టార్ హీరో. క్యాబ్ డ్రైవర్ పై విరుచుకుపడ్డాడు. నాటకాలు ఆడకు అంటూ క్యాబ్ డ్రైవర్ ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

డబ్బులు ఎక్కువ అడిగాడని క్యాబ్ డ్రైవర్ పై గొడవకు దిగాడో స్టార్ హీరో. క్యాబ్ డ్రైవర్ పై విరుచుకుపడ్డాడు. నాటకాలు ఆడకు అంటూ క్యాబ్ డ్రైవర్ ని బెదిరించే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

  • Published May 09, 2024 | 10:23 PMUpdated May 09, 2024 | 10:23 PM
వీడియో: క్యాబ్ డ్రైవర్‌తో స్టార్ హీరో గొడవ.. డబ్బులు ఎక్కువ అడిగాడని..

ఎంత సెలబ్రిటీలు అయినా.. ఎంత డబ్బు సంపాదించినా గానీ కొంతమంది ఆ డబ్బుని మంచి నీళ్లలా ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేయడానికి ఇష్టపడరు. చాలా పొదుపుగా ఉంటారు ఈ విషయంలో. తాజాగా ఓ హీరో కూడా ఇలా పొదుపుగా ఉన్నట్టే కనిపించాడు ఒక వీడియోలో. యాప్ లో చూపించిన లొకేషన్ లో ఆ హీరోని క్యాబ్ డ్రైవర్ దించాడు. దించిన తర్వాత యాప్ లో ఎక్కువ అమౌంట్ చూపించింది. అయితే అమౌంట్ ఎందుకు ఎక్కువ చూపిస్తుంది, నేను ఇవ్వనుపో అంటూ ఆ హీరో క్యాబ్ డ్రైవర్ తో గొడవకు దిగాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

12త్ ఫెయిల్ హీరో విక్రాంత్ మాస్సే గురించి తెలిసే ఉంటుంది. ఈ మూవీలో అతని నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో విక్రాంత్ రేంజే మారిపోయింది. ఒక్క సినిమాతో స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం విక్రాంత్ చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అయితే 12త్ ఫెయిల్ సినిమాలో అంత అమాయకంగా, కూల్ గా కనిపించిన విక్రాంత్.. రియల్ లైఫ్ లో మాత్రం ఇంత దూకుడుగా ఉంటాడా అనేలా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సదరు హీరో క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడుతున్నట్లు ఉంది. ఆ వీడియోని క్యాబ్ డ్రైవర్ రికార్డ్ చేశాడు. తన పేరు ఆశిష్ అని.. తానొక క్యాబ్ డ్రైవర్ నని.. ఓ ప్రయాణకుడ్ని ఎక్కించుకుని అతని లొకేషన్ లో దింపానని అన్నాడు. కానీ తనకు అతను డబ్బులు ఇవ్వనని అంటున్నాడని.. పైగా తనను తిడుతున్నాడంటూ చెప్పుకొచ్చాడు.

తన ఫోన్ ని ఆ క్యాబ్ డ్రైవర్ హీరో విక్రాంత్ వైపు తిప్పాడు. విక్రాంత్ కెమెరాను చేతులతో అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకు కెమెరా ఆన్ చేశావ్? బెదిరిస్తున్నావా? ఫోన్ యాప్ లో అమౌంట్ ఎందుకు సడన్ గా ఎక్కువ చూపిస్తుంది? నా దగ్గర ఇలాంటి నాటకాలు కుదరవు అంటూ విక్రాంత్ క్యాబ్ డ్రైవర్ పై గొడవకు దిగాడు. దానికి క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ.. యాప్ లో ఎక్కువ చూపిస్తే అది నా తప్పా? మా కంటే మీరే ఎక్కువ సంపాదిస్తారు కదా.. ఎందుకు ఇలా గొడవ పడతారు అంటూ ప్రశ్నించాడు. దానికి విసిగిపోయిన విక్రాంత్.. క్యాబ్ డ్రైవర్ పై గట్టిగా బదులిచ్చాడు. ఎంత సంపాదిస్తే నీకెందుకు? అయినా అది నా కష్టార్జీతం అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన కొంతమంది నెటిజన్స్.. విక్రాంత్ తప్పు లేదని కామెంట్స్ చేస్తుండగా. కొందరు మాత్రం అద్భుతమైన స్క్రిప్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా కొత్త మూవీ ప్రమోషన్స్ కోసం చేసిన స్టంట్ వీడియో అని అంటున్నారు.            

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet