iDreamPost
android-app
ios-app

టిపికల్ దర్శకుడితో నాగచైతన్య సినిమా

  • Published Apr 06, 2022 | 7:01 PM Updated Updated Apr 06, 2022 | 7:01 PM
  • Published Apr 06, 2022 | 7:01 PMUpdated Apr 06, 2022 | 7:01 PM
టిపికల్ దర్శకుడితో నాగచైతన్య సినిమా

మజిలీ నుంచి మంచి సక్సెస్ ట్రాక్ లో దూసుకుపోతున్న నాగ చైతన్యకు తక్కువ గ్యాప్ లో లవ్ స్టోరీ, బంగార్రాజు రూపంలో రెండు వరస సూపర్ హిట్స్ దక్కాయి. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించిన థాంక్ యు షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. విడుదల తేదీని మరికొద్ది రోజుల్లో ఖరారు చేయబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. చైతు విక్రమ్ ల కలయికలోనే రూపొందుతున్న వెబ్ సిరీస్ దూత ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ఇవాళ అధికారికంగా మరో ప్రాజెక్టు అనౌన్స్ చేశారు. విక్రమ్ ప్రభు దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో తీయబోయే ఈ బైలింగ్వల్ మూవీని సైతం గ్రాండ్ గా తీయబోతున్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ విక్రమ్ ప్రభు టిపికల్ కథాంశాలు ఎంచుకునే దర్శకులు. ఇటీవలే తమిళంలో వచ్చిన మానాడు అక్కడ ఎంత విజయం సాధించిందో చూశాం. తెలుగులో సురేష్ బాబు హక్కులు కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇది మన ఆడియన్స్ కి అంత ఈజీగా కనెక్ట్ అయ్యే కథాంశం కాదు. వెంకట్ ప్రభు కెరీర్ మొత్తంలో గర్వంగా చెప్పుకునే సినిమా అజిత్ మంకతా(తెలుగులో గాంబ్లర్)ఒకటే. అంతకు ముందు తీసిన సరోజ, గోవా లాంటివి అక్కడ ఆడాయి కానీ మనదగ్గర కాదు. కార్తీ బిర్యానీ, సూర్య రాక్షసుడు ఫ్లాప్ అయ్యాయి. చెన్నై 60028 కనీసం అనువాదానికి కూడా నోచుకోలేదు. ఈయన లేటెస్ట్ మూవీ మన్మధ లీలై పర్వాలేదనిపించుకుంది.

మరి పక్కా తమిళ స్టైల్ లో సినిమాలు తీసే వెంకట్ ప్రభు అక్కినేని అభిమానుల అంచనాలు ఎలా అందుకోబోతున్నారో వేచి చూడాలి. స్టోరీకి సంబంధించిన లీక్స్ అయితే రాలేదు కానీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని ఇన్ సైడ్ టాక్. హీరోయిన్ గా పూజా హెగ్డే లాక్ అయినట్టే. అఫీషియల్ గా ఇంకా చెప్పలేదు. చైతుతో తను కొన్నేళ్ల క్రితం ఒక లైలా కోసంలో నటించింది. అదేమంత హిట్టు కాదు. అప్పుడీ బుట్టబొమ్మకు ఇమేజూ లేదు. కానీ ఇప్పుడు కథ మారింది. కాంబోకి క్రేజ్ వస్తుంది. మొత్తానికి రెగ్యులర్ ఫార్ములాకు వెళ్లకుండా విభిన్నమైన అంశాలున్న సినిమాలు చేస్తున్న చైతు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ తన పరిధిని పెంచుకుంటున్నాడు

 

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetavrupabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş