iDreamPost
android-app
ios-app

టీనేజర్స్ పెద్దవాళ్ళ పట్ల.. పెద్దవాళ్ళు టీనేజర్స్ పట్ల ఎట్రాక్ట్ అవ్వడానికి కారణం?

  • Published May 11, 2024 | 7:52 PM Updated Updated May 11, 2024 | 7:52 PM

టీనేజర్స్ పెద్ద వాళ్ళ పట్ల ఆకర్షితులవ్వడం, పెద్దవాళ్ళు టీనేజర్స్ పట్ల ఎట్రాక్ట్ అవ్వడం అనేది సహజమైన ప్రక్రియ. అయితే ఇది తప్పైనప్పటికీ దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని పలు స్టడీస్ లో తేలింది.

టీనేజర్స్ పెద్ద వాళ్ళ పట్ల ఆకర్షితులవ్వడం, పెద్దవాళ్ళు టీనేజర్స్ పట్ల ఎట్రాక్ట్ అవ్వడం అనేది సహజమైన ప్రక్రియ. అయితే ఇది తప్పైనప్పటికీ దీని వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని పలు స్టడీస్ లో తేలింది.

టీనేజర్స్ పెద్దవాళ్ళ పట్ల.. పెద్దవాళ్ళు టీనేజర్స్ పట్ల ఎట్రాక్ట్ అవ్వడానికి కారణం?

వయసులో ఉన్న కుర్రాళ్ళకి తమ కంటే వయసులో పెద్దగా ఉన్న మహిళలను ఇష్టపడడం.. పెద్ద ఏజ్ ఉన్న మహిళలు టీనేజ్ కుర్రాళ్ళ పట్ల ఎట్రాక్ట్ అవ్వడం అనేది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. ఇది తప్పు అని చెప్పినా వినే పరిస్థితిలో ఉండే పరిస్థితి లేదు. పైకి ఒప్పుకోకపోయినా లోలోపల ప్రతి మనిషీ ఒక ఏజ్ లో ఈ ఫేస్ ని ఫేస్ ఖచ్చితంగా ఫేస్ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. పెద్ద వయసున్న ఆడవాళ్లు టీనేజ్ కుర్రాళ్లను ఇష్టపడడం, టీనేజ్ కుర్రాళ్ళు పెద్ద వయసున్న మహిళల పట్ల ఆకర్షితులవ్వడం విషయంలోనే కాదు.. పురుషులు కూడా తమ కంటే చిన్న వయసున్న యువతుల పట్ల ఆకర్షితులవ్వడం.. యువతులు తమ కంటే పెద్ద వయసున్న పురుషులను ఇష్టపడడం కూడా జరుగుతుంది. ఇది ఎవరూ పైకి చెప్పకపోయినా ఇలా జరగడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయట. 

టీనేజ్ కుర్రాళ్లు నడి వయసున్న మహిళల పట్ల ఎట్రాక్ట్ అవ్వడానికి కారణాలు:

పరిపక్వత:

టీనేజ్ అమ్మాయిలతో పోలిస్తే నడి వయసు మహిళలు సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయడంలో దిట్ట అని పలు రీసెర్చ్ లు చెబుతున్నాయి. పరిపక్వతతో ఆలోచించి సిచ్యువేషన్స్ ని హేతుబద్ధతతో హ్యాండిల్ చేస్తారట. ఒక విషయం పట్ల ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి, ఆలోచనలను వ్యక్తపరచడానికి నడి వయసున్న మహిళల మెచ్యూరిటీ అనేది ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. టీనేజ్ అమ్మాయిల్లా నాన్చకుండా స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఉంటారట. అందుకే యువకులు వీళ్ళని ఇష్టపడతారట.  

ఆత్మ విశ్వాసం:

కాన్ఫిడెంట్ గా ఉండే మహిళల పట్ల యువకులు బాగా ఆకర్షితులవుతారట. మహిళల్లో ఉన్న ఆ కాన్ఫిడెన్సే తమను కంఫర్ట్ కలిగిస్తుందని యువకులు భావిస్తారట. మహిళల్లో ఉండే ఈ కాన్ఫిడెన్స్ కారణంగా యువకులు తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉండదని భావిస్తారట. అదే టీనేజ్ అమ్మాయిల విషయానికొస్తే.. వారికి నచ్చినట్లు అబ్బాయిలు మారాల్సి వస్తుంది. నడి వయసు మహిళల విషయంలో ఈ పరిస్థితి ఉండదని భావిస్తారట.   

స్వతంత్రం:

కుర్రాళ్ళు మహిళలను ఎక్కువగా ఇష్టపడడానికి మరొక కారణం వారిలో ఉన్న స్వతంత్ర లక్షణం. టీనేజ్ అమ్మాయిల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపించదు. ఎవరో ఒకరి మీద ఆధారపడతారు. కానీ మహిళలు అలా కాదు. తమ నిర్ణయాలను వాళ్లే తీసుకుంటారు. ఈ కారణం వల్లే కొంతమంది యువకులు నడి వయసున్న మహిళలను పెళ్లి చేసుకుంటున్నారు కూడా.

భావ వ్యక్తీకరణ:

మగాళ్లకు లోపల ఏదున్నా గానీ బయటకు చెప్పే లక్షణం సహజంగా ఉంటుంది. ఈ కారణంగా మహిళల పట్ల యువకులు ఆకర్షింపబడతారట. ఈ మహిళలు.. ఇతరుల నుంచి నేర్చుకోవడానికి.. జీవితాన్ని డిఫరెంట్ కోణంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇష్టపడతారట. ఈ కారణంగా యువకులు నడి వయసున్న మహిళల పట్ల ఎట్రాక్ట్ అవుతారట. 

ఎమోషనల్ ఇంటిలిజెన్స్:

రిలేషన్ షిప్స్ లో సంక్లిష్టతలను డీల్ చేయాలంటే ఎంతో ఎమోషనల్ ఇంటిలిజెన్స్ కలిగి ఉండాలి. అదేనండి.. భావోద్వేగ తెలివి. ఇది అందరి వల్ల సాధ్యం కాదు. ఈ విషయంలో ఎక్కువ అనుభవం ఉన్న మహిళలు అయితే అబ్బాయిల ఫీలింగ్స్ ని బాగా అర్థం చేసుకుంటారట. సున్నితంగా ఎలా హ్యాండిల్ చేయాలో వీరికి తెలిసినంతగా టీనేజ్ అమ్మాయిలకు తెలియదట. అందుకే టీనేజ్ అమ్మాయిల కంటే కూడా నడి వయసున్న మహిళలకు ఎట్రాక్ట్ అవుతారట. నడి వయసున్న మహిళల పట్ల ఎట్రాక్ట్ అవ్వడానికి మరో కారణం.. ఈ మహిళలను హ్యాండిల్ చేస్తే అన్ని వయసుల ఆడవారిని హ్యాండిల్ చేయగలుగుతారని ఒక నమ్మకం.

సినిమాల ప్రభావం:

సినిమాల్లో నడి వయసున్న మహిళలకు యువకులు లైన్ వేసినట్టు చూపించడం.. తమ కంటే వయసులో పెద్ద వారైన టీచర్స్ పై కుళ్ళు జోకులు వేయించడం, లవ్ ట్రాక్ నడిపించడం వంటివి కూడా యువకుల మీద ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక మహిళలు టీనేజ్ కుర్రాళ్ల పట్ల ఎట్రాక్ట్ అవ్వడానికి కారణాలు:

యువకుల్లో ఉత్సాహం, ఓపెన్ మైండెడ్:

యువకులు ఉత్సాహంగా ఉండడం వల్ల నడి వయసున్న మహిళలు వారి పట్ల ఆకర్షితురాలవుతారట. కొత్త ఆలోచనలను పంచుకోవడంలో యువకులు ఓపెన్ గా ఉంటారన్న కారణంగా మహిళలు ఇష్టపడతారట. వీరితో తమ ఆలోచనలను పంచుకోవచ్చునని భావిస్తారట.     

ఫిట్నెస్:

పెద్ద వయసున్న మగాళ్లు పొట్ట, బట్ట వంటివి వచ్చి చూడ్డానికి అసహ్యం కలిగేలా ఉంటారన్న కారణంగా సిక్స్ ప్యాక్ ఉండి, మంచి హెయిర్ స్టైల్ ఉండి హీరోల్లా ఉండే యువకులను ఇష్టపడతారట. 

యువతుల్లా ఫీల్ అవ్వడానికి:

యువకులతో ఉండడం వల్ల తాము కూడా యువతులమే అని ఫీల్ అవుతారట. 

పురుషుల పట్ల యువతులు, యువతుల పట్ల పురుషులు ఎట్రాక్ట్ అవ్వడానికి పైన చెప్పిన కారణాలే కారణమవుతాయట. అయితే భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం, వారి ఆలోచనలకు విలువ ఇవ్వడం వంటివి చేస్తే ఇలా ఇతరుల పట్ల ఆకర్షితులయ్యే పరిస్థితి ఉండదని.. చాలా మంది ఈ విషయంలో కఠినంగా ఉంటారని పలు రీసెర్చ్ లు చెబుతున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.