iDreamPost
android-app
ios-app

మరో స్త్రీకి దగ్గరవ్వడానికి పెళ్ళైన మగాళ్లు చెప్పే అబద్దాలు ఇవే! జాగ్రత్త అమ్మాయిలు

  • Published Jun 07, 2024 | 7:21 PM Updated Updated Jun 07, 2024 | 7:21 PM

Don't Trust These Men: పెళ్ళైన మగాళ్లు అబద్ధాలు చెప్పి పరాయి స్త్రీకి దగ్గరవ్వాలని అనుకుంటారు. అలాంటి అబద్ధాలను నమ్మి దగ్గరైతే నిట్టనిలువుగా ముంచేసి పోతారు. అయితే అమ్మాయిలకి దగ్గరవడానికి పెళ్ళైన మగాళ్లు ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడండి.

Don't Trust These Men: పెళ్ళైన మగాళ్లు అబద్ధాలు చెప్పి పరాయి స్త్రీకి దగ్గరవ్వాలని అనుకుంటారు. అలాంటి అబద్ధాలను నమ్మి దగ్గరైతే నిట్టనిలువుగా ముంచేసి పోతారు. అయితే అమ్మాయిలకి దగ్గరవడానికి పెళ్ళైన మగాళ్లు ఎక్కువగా చెప్పే అబద్ధాలు ఏంటో తెలుసుకుని జాగ్రత్త పడండి.

మరో స్త్రీకి దగ్గరవ్వడానికి పెళ్ళైన మగాళ్లు చెప్పే అబద్దాలు ఇవే! జాగ్రత్త అమ్మాయిలు

రిలేషన్ షిప్స్ కి జెన్యూనిటీ అనేది చాలా ముఖ్యం. ఏ రిలేషన్ షిప్ లో అయినా రహస్యాలు ఉండకూడదు. ఏవీ దాచకూడదు. కొంతమంది పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నా కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి మరో అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవాలని అనుకుంటారు. మరో స్త్రీకి దగ్గరవ్వడానికి అబద్ధాలు చెబుతుంటారు. ఆ అబద్ధాలు చెప్పే వేరే అమ్మాయికి దగ్గరవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఆ వ్యక్తి జెన్యూనో కాదో అన్న విషయం తెలియదు. అయితే సాధారణంగా పెళ్ళైన మగాళ్లు ఎక్కువగా చెప్పే కామన్ అబద్ధాలు తెలుసుకుంటే కనుక ఇటువంటి మాయగాళ్ల వలలో పడకుండా తప్పించుకోవచ్చు. 

ఇష్టం లేని పెళ్లి చేశారని చెప్పడం:

ఇంట్లో వాళ్ళు తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని.. తన భార్య అంటే ఇష్టం ఉండదని అబద్ధం చెప్తారు. దీని వల్ల ఇద్దరం సంతోషంగా ఉండడం లేదని.. విడిపోవాలనుకుంటున్నామని చెబుతారు. ఈ మాటలు నమ్మితే ఇక అంతే పరిస్థితి. లొంగిన తర్వాత మీకు బ్రేకప్ చెప్తారు కానీ ఇంట్లో ఇల్లాలికి మాత్రం బ్రేకప్ చెప్పరు. కాబట్టి ఇలాంటి అబద్ధపు మాటలకు దూరంగా ఉండడం మంచిది.

భార్య గురించి చెడుగా చెప్పేవారిని అస్సలు నమ్మకూడదు:

వేరే మహిళకు దగ్గరవ్వడానికి తన భార్య గురించి చెడుగా చెబుతుంటారు. భార్య స్వభావం మంచిది కాదని.. తనను గౌరవించడం లేదని సింపతీతో మరో స్త్రీకి దగ్గరవ్వాలని అనుకుంటారు. ఇలాంటి వారి మాటలు నమ్మకూడదని.. వీరు చెప్పేవి అబద్ధాలు అని నిపుణులు చెబుతున్నారు.    

ఒంటరిగా ఉన్నా అని చెప్పడం:

భార్యతో కలిసి ఉంటూనే.. గొడవల కారణంగా ఆమెతో విడిపోయి ఒక్కడినే ఉంటున్నానని చెబుతారు. ఒకవేళ నిజంగానే ఒంటరిగా ఉంటున్నా గానీ చట్టపరంగా విడిపోకపోవచ్చు. విడాకులు ఇవ్వకపోవచ్చు. ఇలాంటి వారితో రిలేషన్ కొనసాగిస్తే మాజీ మిస్ వైజాగ్ నక్షత్ర ఘటనే మీ లైఫ్ లో కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  

పిల్లలు కలగడం లేదని చెప్పడం:

తన భార్యకు సంతాన లోపం కారణంగా తమకు పిల్లలు పుట్టడం లేదని.. దీని వల్ల ఇంట్లో గొడవలు అవుతున్నాయని.. ప్రశాంతత లేదని చెబుతారు. ఇలాంటి వారిని నమ్మితే నట్టేట ముంచుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

లైOగిక అసంతృప్తి లేదని చెప్పడం:

తన భార్య వల్ల సుఖం లేదని.. శృOగారపరంగా సంతోషంగా లేనని మరో స్త్రీకి దగ్గరవ్వాలని చూస్తారు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదని నిపుణులు చెబుతున్నారు.