iDreamPost
android-app
ios-app

LICలో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. నెలకు 25 వేల జీతం.. అర్హులు వీరే

Life Insurance Corporation Of India: మీరు జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎల్ ఐసీలో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

Life Insurance Corporation Of India: మీరు జాబ్స్ కోసం వెతుకుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎల్ ఐసీలో వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

LICలో వర్క్ ఫ్రం హోం జాబ్స్.. నెలకు 25 వేల జీతం.. అర్హులు వీరే

రోజు రోజుకు నిరుద్యోగం ఎక్కువైపోతున్నది. ప్రతి యేట వేల సంఖ్యలో పట్టాభద్రులు బయటికొస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం హెవీ కాంపిటీషన్ ఉంది. చిన్న జాబ్ అయిన సరే లక్షల్లో పోటీపడుతున్నారు. ఎలాగైన జాబ్ సాధించాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. చదువు పూర్తైన వారు ఏదైనా జాబ్ దొరికితే బాగున్ను అని అనుకుంటున్నారు. మరికొంతమంది ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానాన్ని కల్పిస్తున్నాయి. మరి మీరు కూడా వర్క్ ఫ్రం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో వర్క్ ఫ్రం హోం జాబ్స్ కు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులు ఎవరంటే?

ఎల్ఐసీ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ఇంటి వద్ద ఉండే పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. తాజాగా ఎల్ఐసీ సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కు ఇంటర్ పూర్తైన వారు అప్లై చేసుకోవచ్చు. మార్కెటింగ్ స్కిల్స్ కలిగి ఉండాలి. అర్హులైన స్త్రీ, పురుషులు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 25 వేల జీతం అందిస్తారు. అప్లికేషన్స్ ను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్య్వూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న వారు అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.