iDreamPost
android-app
ios-app

ఇంటర్ పాసైన వారికి లక్కీ ఛాన్స్.. నెలకు 30 వేలు పొందొచ్చు.. ఎలా అంటే?

Ayushman Mitra: మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అందించే ఓ పథకం ద్వారా నెలకు రూ. 30 వేలు పొందొచ్చు.

Ayushman Mitra: మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం అందించే ఓ పథకం ద్వారా నెలకు రూ. 30 వేలు పొందొచ్చు.

ఇంటర్ పాసైన వారికి లక్కీ ఛాన్స్.. నెలకు 30 వేలు పొందొచ్చు.. ఎలా అంటే?

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల శ్రేయస్సు కోసం అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. పేదలకు లబ్ధి చేకూరేలా వినూత్నమైన పథకాలను తీసుకొస్తున్నది. పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా కృషి చేస్తోంది ప్రభుత్వం. ఆర్థికసాయం అందించే పథకాలు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్, పలు వర్గాలకు రుణాలు అందించడం వంటి చర్యలు తీసుకుంటున్నది. ప్రజల ఆరోగ్యంపై దృష్టిపెట్టిన ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కోట్లాదిమంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నది. అయితే ఈ పథకం ద్వారా ఇంటర్ పాసైనవారు నెలకు 30 వేలు పొందే ఛాన్స్ ఉంది. ఎలా అంటే?

కేంద్ర ప్రభుత్వం వరల్డ్ లోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకాన్ని ఆయుష్మాన్ భారత్ పేరిట తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ప్రజలకు ఉచిత ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ కు సంబంధించిన సమాచారాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ మిత్రను ప్రారంభించింది. మీరు ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఆయుష్మాన్ మిత్రగా నియామకం పొంది రూ. 15- 30వేల వరకు ఆదాయం పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో ఆయుష్మాన్ మిత్రగా నియామకం పొందొచ్చు. ఇంటర్ పాసైన వారికి ఇది లక్కీ ఛాన్స్.

ఆయుష్మాన్ మిత్రల కోసం ప్రతి జిల్లాలో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తైన తర్వాత, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఆయుష్మాన్ మిత్ర పోస్టులో నియమిస్తారు. ఆయుష్మాన్ మిత్రలు నిర్వహించాల్సిన విధులు ఏంటంటే? ఆయుష్మాన్ భారత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడం. ఆయుష్మాన్ కార్డు తయారు చేయడం. రోగులకు సంబంధించిన డేటాను బీమా ఏజెన్సీకి పంపిస్తారు. 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉండాలి. స్థానిక భాషతో పాటు హిందీ, ఇంగ్లీష్ పై పట్టు, కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఆయుష్మాన్ మిత్ర కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.