iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. TGRTCలో 3,035 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

  • Published Jul 02, 2024 | 6:44 PM Updated Updated Jul 02, 2024 | 6:44 PM

TGRTC Recruitment 2024: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీజీఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

TGRTC Recruitment 2024: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీజీఆర్టీసీలో 3035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Published Jul 02, 2024 | 6:44 PMUpdated Jul 02, 2024 | 6:44 PM
నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. TGRTCలో 3,035 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కొలువులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే గ్రూప్స్, డీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతుండగా త్వరలోనే వైద్యశాఖలో కూడా భారీగా ఉద్యోగాలన భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టీజీఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి 3,035 పోస్టుల భర్తీకి రేవంత్‌ సర్కార్ అనుమతి ఇచ్చింది. వివిధ కేటగిరీల్లో భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల్లో 2000 డ్రైవర్‌ పోస్టులు, 743 శ్రామిక్‌ పోస్టులు, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (మెకానిక్‌) పోస్టులు, 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌ (ట్రాఫిక్‌) పోస్టులు, 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ పోస్టులు, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (సివిల్‌) పోస్టులు, 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌ పోస్టులు, 11 సెక్షన్‌ ఆఫీసర్‌ (సివిల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (జనరల్‌) పోస్టులు, 7 మెడికల్‌ ఆఫీసర్‌ (స్పెషాలిస్ట్‌) కొలువులు ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కానున్నది.

టీజీఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 3035 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజారవాణాలో కీలకపాత్ర పోషిస్తున్న టీజీఆర్టీసీని మరితం బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఈ కొత్త బస్సులకు అనుగుణంగా నియమకాలు చేపడుతున్నట్లు వివరించారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş