iDreamPost
android-app
ios-app

మీరు బైక్ నడపగలరా?.. నెలకు 65 వేలు సంపాదించుకునే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి

Delivery jobs in Dubai: మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, బైక్ నడుపొస్తే చాలు నెలకు 65 వేలు సంపాదించుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోండి.

Delivery jobs in Dubai: మీరు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, బైక్ నడుపొస్తే చాలు నెలకు 65 వేలు సంపాదించుకోవచ్చు. ఇలా అప్లై చేసుకోండి.

మీరు బైక్ నడపగలరా?.. నెలకు 65 వేలు సంపాదించుకునే ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి

ప్రతీఏడు వేలాది మంది పట్టాభద్రులు తయారవుతున్నారు. ఉద్యోగాలకు కాంపిటీషన్ పెరిగిపోయింది. ఉపాధి మార్గాలు కూడా కరువయ్యాయి. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చాలీ చాలని జీతాలతో బతుకు బండిని నెట్టుకొస్తున్నారు. మరికొందరు ఏ పని లేక నానా కష్టాలు పడుతున్నారు. ఖాళీగా ఉండలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఖాళీగా ఉంటావంటూ ఇంట్లో వాళ్లు చివాట్లు పెడుతుంటారు. బంధువులు, ఇరుగుపొరుగు వారు నెక్ట్స్ ఏంటీ అంటూ ఊపిరాడనివ్వరు. ఇలాంటి సమయంలో మంచి జీతంతో కూడిన జాబ్ దొరికితే బాగుండని భావిస్తుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు.

కానీ, ఉద్యోగాలు దొరక్క నిరాశ చెందుతుంటారు. అయితే ఉద్యోగం కోసం చదువుతో పాటు ఇతర స్కిల్స్ ఉంటే మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరి మీరు నిరుద్యోగులా? జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. మీకు బైక్ నడపడం వస్తే చాలు నెలకు 65 వేలు సంపాదించుకునే ఛాన్స్ కల్పిస్తోంది. ఏంటీ బైక్ నడుపొస్తే 65 వేల జీతం వస్తుందా.. అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమేనండి బాబు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండి బైక్ నడపగలిగితే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మీకోసం అదిరిపోయే జాబ్ అవకాశం అందుబాటులో ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి బంపరాఫర్.

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్), తెలంగాణ ప్రభుత్వంలో కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, అర్హత, నైపుణ్యం కలిగిన, సెమీ స్కిల్డ్ కార్మికుల విదేశీ ప్లేస్మెంట్ శిక్షణ కొరకు అధికారులు ప్రకటన జారీ చేశారు. దుబాయ్ లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్) ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్నేషనల్ టు వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దరఖాస్తు దారులు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు స్విగ్గీ, జొమాటో వంటి ఇతర ఫుడ్ డెలివరీ సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇంగ్లీష్ భాషపై పట్టుండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 65 వేల వరకు జీతం వస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ రెస్యూమ్ ”tomcom.Resume@gmail.com” మెయిల్‌కి పంపాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాల కోసం www.tomcom.telangana.gov.in ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదా 9440051285 / 94400 48500 / 9701040062 ఫోన్ నెంబర్ల కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.