iDreamPost
android-app
ios-app

ఈ అర్హతలుంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలు మీవే.. నెలకు 1,94,660 జీతం

కోర్టులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ అర్హతలు ఉంటే చాలు భారీ వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఎంపికైతే నెలకు 1,94,660 జీతం అందుకోవచ్చు.

కోర్టులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈ అర్హతలు ఉంటే చాలు భారీ వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఎంపికైతే నెలకు 1,94,660 జీతం అందుకోవచ్చు.

ఈ అర్హతలుంటే చాలు.. కోర్టులో ఉద్యోగాలు మీవే.. నెలకు 1,94,660 జీతం

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. మీరు ఎప్పటి నుంచో గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లైతే ఇదే మంచి సమయం. కోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,94,660 జీతం అందుకోవచ్చు. అయితే మీకు ఆ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్‌లో జిల్లా జడ్జీ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9 ఖాళీలను భర్తీచేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలో పనిచేసే ఏదైనా కోర్టుల్లో ఏడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు ఆఫ్‌ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న వారు మే 14 నుంచి జూన్ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1000 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • జిల్లా జడ్జీ పోస్టులు

ఖాళీల సంఖ్య:

  • 09

అర్హత:

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్స్ లా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హైకోర్టు లేదా హైకోర్టు పరిధిలో పనిచేసే ఏదైనా కోర్టుల్లో ఏడేళ్ల పాటు అడ్వకేట్ లేదా ప్లీడర్‌గా ప్రాక్టీస్ ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 14.05.2024 నాటికి 35-48 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ:

  • ఆఫ్‌ లైన్

ఎంపిక విధానం:

  • స్క్రీనింగ్ టెస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.1,44,840 – రూ.1,94,660 జీతంగా ఇస్తారు.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

  • The Chief Secretary,
    Government of Telangana,
    General Administration Department,
    Telangana Secretariat,
    Hyderabad-500022.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 14-05-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 13-06-2024.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి