అప్లై చేయండి.. జాబ్ కొట్టండి.. రైల్వేలో 2,250 కానిస్టేబుల్, SI ఉద్యోగాలు

RPF Constable,SI Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందించింది. టెన్త్, డిగ్రీ అర్హతతో 2,250 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని జాబ్ కొట్టండి.

RPF Constable,SI Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిరుద్యోగులకు భారీ శుభవార్తను అందించింది. టెన్త్, డిగ్రీ అర్హతతో 2,250 ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని జాబ్ కొట్టండి.

అవకాశాలు ఆకాశం నుంచి ఊడిపడవు.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ ఆ శక్తి మాత్రం కొందరికే ఉంటుంది. ఖచ్చితమైన ప్రణాళిక, అంకితబావం ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమైతే ఈ నోటిఫికేషన్ ను మాత్రం అస్సలు వదలొద్దు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 2,250 కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్, మరియు కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఆర్పీఎఫ్ /ఆర్​పీఎస్​ఎఫ్ లో 2000 కానిస్టేబుల్ పోస్టులను, 250 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 10 శాతం ఖాళీలు మాజీ సైనికులకు, 15 శాతం మహిళా అభ్యర్థులకు కేటాయించారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ త్వరలో ప్రకటించనుంది. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఆర్ఆర్బీ అధికారిక సైట్ rpf.Indianrailways.gov.in ని సందర్శించాలి.

ముఖ్యమైన సమాచారం:

ఆర్​పీఎఫ్ లో మొత్తం ఉద్యోగాలు:

  • 2000 కానిస్టేబుల్ పోస్టులు
  • 250 ఎస్ఐ పోస్టులు

విద్యా అర్హత

  • సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:

  • సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. కానిస్టేబుల్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఇవ్వబడుతుంది.

ఎంపిక విధానం:

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) మరియు ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (PMT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతం:

  • కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 32 వేల వరకు అందిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా, మాజీ సైనికోద్యోగులు, ఈబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభం:

  • త్వరలో

ఆర్ఆర్బీ అధికారిక సైట్:

rpf.Indianrailways.gov.in

Show comments