iDreamPost

ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. లక్ష వరకు జీతం!

మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు రూ. లక్ష వరకు జీతం అందుకోవచ్చు.

మీరు కేంద్రప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. నెలకు రూ. లక్ష వరకు జీతం అందుకోవచ్చు.

ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేదు.. లక్ష వరకు జీతం!

ఇండియన్ నేవీలో చేరాలని కలలుగనే యువతకు గొప్ప అవకాశం. నేవీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను సాధించొచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. లక్ష వరకు జీతాన్ని అందుకోవచ్చు. త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా పలు విభాగాల్లో 254 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ప్రారంభ వేతనం రూ. 56 వేలు అందిస్తారు. డీఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సులు కలుపుకుని నెలకు రూ. లక్ష వరకు అందుకోవచ్చు.

అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి కేరళలోని ఎజిమలలోని ‘ఇండియన్ నేవీ అకాడమీ’లో 2025 జనవరిలో ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభమైంది. మార్చి 10 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అంటే అప్లై చేసుకునేందుకు ఇంకా 6 రోజుల సమయం మాత్రమే ఉంది. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఇండియన్ నేవీ అధికారికి వెబ్ సైట్ https://www.joinindiannavy.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ మొత్తం ఖాళీల సంఖ్య:

  • 254

విభాగాల వారీగా ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్:

  • 136

ఎడ్యుకేషన్ బ్రాంచ్:

  • 18

టెక్నికల్ బ్రాంచ్:

  • 100

అర్హతలు:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి 1998 నుంచి 2006 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం:

  • విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్​ లిస్ట్​ అయిన అభ్యర్థులకు ఎస్​ఎస్​బీ ఇంటర్వ్యూకు ఎంపికైన విషయాన్ని ఈ-మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. మెడికల్ టెస్టులో ఫిట్​గా తేలిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రారంభ వేతనం:

  • ఎస్​ఎల్​టీ బేసిక్ పే కింద రూ.56,100 ఇస్తారు. దీంతోపాటు ఇతర అలవెన్సులూ ఉంటాయి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తుకు చివరితేది:

  • 24-02-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 10-03-2024

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి