iDreamPost
android-app
ios-app

జాబ్ సెర్చ్‌లో ఉన్నారా?.. నెలకు 69 వేల జీతంతో Govt Jobs రెడీ.. మిస్ చేసుకోకండి

  • Published Aug 06, 2024 | 4:01 PM Updated Updated Aug 06, 2024 | 4:01 PM

ITBP Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 69 వేల జీతం అందుకోవచ్చు.

ITBP Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 69 వేల జీతం అందుకోవచ్చు.

  • Published Aug 06, 2024 | 4:01 PMUpdated Aug 06, 2024 | 4:01 PM
జాబ్ సెర్చ్‌లో ఉన్నారా?.. నెలకు 69 వేల జీతంతో Govt Jobs రెడీ.. మిస్ చేసుకోకండి

ప్రయత్నమే విజయానికి తొలి మెట్టు. కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు సాధించడం కష్టమైపోతున్నది. కాంపిటీషన్ హెవీగా ఉండడం, జాబ్స్ తక్కువ సంఖ్యలో ఉండడంతో యువత నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. మరి మీరు కూడా జాబ్ సెర్చ్ లో ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 69 వేల జీతం అందుకోవచ్చు. అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఎంపిక ఎలా చేపడతారు? ఆ వివరాలు మీకోసం.

మీరు టెన్త్, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నట్లైతే ఈ జాబ్స్ మీకోసమే. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ /ట్రేడ్స్‌మెన్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌ /ట్రేడ్స్‌మెన్‌ (బార్బర్, సఫాయి కర్మచారి–గార్డెనర్‌) పోస్టుల భర్తీ చేయనున్నది. మొత్తం 143 పోస్టులు భర్తీ చేయనున్నారు. అభ్యర్థుల వయసు పోస్టులను అనుసరించి 21-25 ఏళ్లు కలిగి ఉండాలి. ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష, ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్‌ స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 26 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం పోస్టుల సంఖ్య: 143.

అర్హత:

  • కానిస్టేబుల్‌/ట్రేడ్స్‌మెన్‌(బార్బర్, సఫా­యి కర్మచారి–గార్డెనర్‌) పోస్టులకు మెట్రిక్యులేషన్‌/పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత వృత్తిలో పని అనుభవం ఉండాలి. కానిస్టేబుల్‌(గార్డెనర్‌)పోస్టులకు మెట్రిక్యులేషన్‌ లేదా పదో తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ/డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి:

  • కానిస్టేబుల్‌(బార్బర్‌/సఫాయి కర్మచారి) పోస్టులకు 21 నుంచి 25 ఏళ్లు, కానిస్టేబుల్‌(గార్డెనర్‌) పోస్టులకు 21 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌(పీఎస్‌టీ), రాతపరీక్ష, ఒరిజనల్‌ డాక్యుమెంట్ల వెరిఫికేషన్, ప్రాక్టికల్‌ స్కిల్‌ టెస్ట్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.21,700 నుంచి 69,100 అందిస్తారు.

దరఖాస్తు విధానం:  

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది:

  • 28-07-2024

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:

  • 26-08-2024

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom