iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసైన వారికి బెస్ట్ ఛాన్స్.. నెలకు లక్షన్నర జీతంతో Govt జాబ్స్

India Post Payments Bank Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు లక్షన్నర జీతం అందుకోవచ్చు.

India Post Payments Bank Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు లక్షన్నర జీతం అందుకోవచ్చు.

డిగ్రీ పాసైన వారికి బెస్ట్ ఛాన్స్.. నెలకు లక్షన్నర జీతంతో Govt జాబ్స్

మంచి వేతనంతో కూడిన జాబ్ పొందాలంటే కనీస విద్యార్హత డిగ్రీ ఉండాల్సిందే. డిగ్రీ క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలను సాధించొచ్చు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? మీరు డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలక ఎంపికైతే నెలకు లక్షన్నర వరకు జీతం అందుకోవచ్చు. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్స్ ను సాధించి లైఫ్ లో సెట్ అయిపోవచ్చు.

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. పేస్కేల్ III, V,VI,VIIతో రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి అభ్యర్థులు డిగ్రీ, సీఏ, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఆగస్టు 09 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 09

అర్హత:

  • పోస్టును అనుసరించి అభ్యర్థులు డిగ్రీ, సీఏ, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • సీనియర్ మేనేజర్ 26-35, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 32-45, డిప్యూటీ జనరల్ మేనేజర్ 35-55, జనరల్ మేనేజర్ 38-55

ఎంపిక విధానం:

  • దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను అనుసరించి నెలకు లక్షన్నర వరకు అందుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:

  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ అభ్యర్థులకు రూ. 150, ఇతరులు రూ. 750 చెల్లించాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 20-07-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 09-08-2024