iDreamPost
android-app
ios-app

రాత పరీక్ష లేకుండానే ESICలో భారీగా ఉద్యోగాలు.. నెలకు 2 లక్షల వరకు జీతం

  • Published May 29, 2024 | 7:19 PM Updated Updated May 29, 2024 | 7:19 PM

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈఎస్ఐసీలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 2 లక్షల వరకు జీతం అందుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఈఎస్ఐసీలో భారీ వేతనంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 2 లక్షల వరకు జీతం అందుకోవచ్చు.

  • Published May 29, 2024 | 7:19 PMUpdated May 29, 2024 | 7:19 PM
రాత పరీక్ష లేకుండానే ESICలో భారీగా ఉద్యోగాలు.. నెలకు 2 లక్షల వరకు జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 2 లక్షల వరకు జీతం అందుకోవచ్చు. ఆ అర్హతలున్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇటీవల ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ ను సాధిస్తే లైఫ్ లో సెట్ అయిపోవచ్చు. ఈ పోస్టులకు అర్హులు ఎవరు? అర్హతలు ఏంటి? వయోపరిమితి ఎంత? దరఖాస్తు గడువు ఎప్పటి వరకు వంటి వివరాలు మీకోసం.

రాజస్థాన్, అల్వార్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) అండ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 115 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఎంబీబీఎస్, సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులను అనుసరించి అభ్యర్థులు 67 ఏళ్లు మించకూడదు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జూన్ 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీల సంఖ్య:

115

విభాగాల వారీగా ఖాళీలు:

ప్రొఫెసర్:

09

అసోసియేట్ ప్రొఫెసర్:

21

అసిస్టెంట్ ప్రొఫెసర్:

30

సీనియర్ రెసిడెంట్:

34

సీనియర్ రెసిడెంట్ (జీడీఎంవో):

12

సూపర్ స్పెషలిస్ట్:

09

అర్హత:

పోస్టులను అనుసరించి ఎన్‌ఎంసీ/ఎంఐసీ గైడ్‌లైన్స్ ప్రకారం ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

పోస్టులను అనుసరించి 67 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం:

ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

ప్రొఫెసర్ రూ.2,01,213, అసోసియేట్ ప్రొఫెసర్ రూ.1,338,02, అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.1,14,955, సీనియర్ రెసిడెంట్ రూ.67,700, సీనియర్ రెసిడెంట్ (జీడీఎంవో) రూ.67,700, సూపర్ స్పెషలిస్ట్, ఫుల్‌టైమ్ ఎంట్రీ లెవెల్ రూ.2,00,000; సీనియర్ లెవెల్ రూ.2,40,000. పార్ట్‌టైమ్ ఎంట్రీ లెవెల్ రూ.1,00,000; సీనియర్ లెవెల్ రూ.1,50,000.

దరఖాస్తు ఫీజు:

రూ.225 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు.

ఇంటర్వ్యూ తేదీ:

04-06-2024

వేదిక:

Academic Block,
ESIC MCH, Alwar,
Rajasthan- 301030.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş