7thపాసయ్యారా? ఈ ఉద్యోగాలు మీకోసమే.. మిస్ చేసుకోకండి

7thపాసయ్యారా? ఈ ఉద్యోగాలు మీకోసమే.. మిస్ చేసుకోకండి

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. మీరు 7వ తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందొచ్చు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? అయితే మీకు లక్కీ ఛాన్స్. మీరు 7వ తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందొచ్చు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటీషన్ నెలకొంది. గవర్నమెంట్, ప్రైవేట్ రంగాల్లో జాబ్ సాధించాలంటే క్వాలిఫికేషన్ తో పాటు స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. పోటీ పరీక్షలు, ఇంటర్య్వూల్లో అసాధారణ ప్రతిభ కనబరిస్తే తప్పా జాబ్ పొందలేరు. మరి మీరు ప్రభుత్వ కొలువుల కోసం ఎదురుచూస్తున్నారా? మీకు శుభవార్త. మీరు 7వ తరగతి పాసైతే చాలు ప్రభుత్వ ఉద్యోగం పొందే ఛాన్స్ వచ్చింది. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్/గార్డనర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి 7,10, డిగ్రీ, పీజీ విద్యార్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు మే 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

వయోపరిమితి:

  • అభ్యర్థుల కనీస వయస్సు 22 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.

విద్యార్హత:

  • ఫ్యాకల్టీ పోస్టులకు పోటీపడే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి రూరల్ డెవలప్‌మెంట్/ఎంఏ/సోషియాలజీ/సైకాలజీ/బీఎస్సీ(అగ్రికల్చర్)/బిఎడ్ మొదలైన వాటిలో ఎంఎస్ డబ్య్లూ/ఎంఏతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

ఆఫీస్ అసిస్టెంట్:

  • అభ్యర్థులు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు బీఎస్ డబ్య్లూ/బీఏ/బీకాంతో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

అటెండర్:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

తోటమాలి/చౌకీదార్:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులు వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు.

జీతం:

  • ఫ్యాకల్టీ – నెలకు రూ 20000
  • ఆఫీస్ అసిస్టెంట్ – నెలకు రూ 12000
  • అటెండర్ – నెలకు రూ. 8000
  • చౌకీదార్/గార్డనర్ – నెలకు రూ. 6000

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 31-05-2024
Show comments