డిగ్రీ, BTech పాసైతే చాలు..Bank జాబ్స్ రెడీ.. వెంటనే అప్లై చేసుకోండి!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. డిగ్రీ, బీటెక్ పాసైతే చాలు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రముఖ బ్యాంక్ భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. డిగ్రీ, బీటెక్ పాసైతే చాలు ఈ జాబ్స్ కు అప్లై చేసుకోవచ్చు.

బ్యాంకు జాబ్స్ కు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. యూవత బ్యాంక్ జబ్ సాధించేందుకు ఏళ్ల తరబడి సన్నద్ధమవుతుంటారు. మంచి వేతనంతో పాటు సెలవులు కూడా భారీగా ఉండడం, ఒత్తిడి లేని విధులు, ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేయడం వంటి కారణాలతో బ్యాంక్ జాబ్ లకు విపరీతంగా పోటీపడుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ ఉద్యోగాలను సాధించాలని అనుకుంటున్నారా? అయితే మీరు డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైతే చాలు 459 బ్యాంక్ పోస్టులు రెడీగా ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వెంటనే అప్లై చేసుకోండి.

బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిక్స్‌డ్ టర్మ్ ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీవోబీ శాఖల్లో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 459 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఈ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, మేనేజర్ ఎంఎస్‌ఎంఈ, గ్రూప్ హెడ్, టెరిటరీ హెడ్, ప్రైవేట్ బ్యాంకర్ రేడియన్స్ ప్రైవేట్, సీనియర్ డెవలపర్ తదితర పోస్టులున్నాయి. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్య సమాచారం:

మొత్తం పోస్టుల సంఖ్య: 459

అర్హత:

  • పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, బీసీఏ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా, సీఏ/ సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి 25 నుంచి 50 ఏళ్ల వయసును కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • ఇంటర్వ్యూ, ఇతర పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 02-07-2024
Show comments