iDreamPost
android-app
ios-app

టెన్త్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 56 వేల జీతం

  • Published Feb 12, 2024 | 5:44 PM Updated Updated Feb 12, 2024 | 5:44 PM

ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి ఇస్రో గుడ్ న్యూస్ అందించింది. మంచి వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే వారికి ఇస్రో గుడ్ న్యూస్ అందించింది. మంచి వేతనంతో పలు ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆన్ లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి.

  • Published Feb 12, 2024 | 5:44 PMUpdated Feb 12, 2024 | 5:44 PM
టెన్త్ అర్హతతో ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 56 వేల జీతం

నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారత అంతరిక్షపరిశోధనా సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. మంచి వేతనంతో ఈ ఉద్యోగాలను మీరు దక్కించుకోవచ్చు. పోస్టులను అనుసరించి టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలతో మీరు పోటీపడొచ్చు. బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, యూఆర్‌ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్‌ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 224 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 10 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 1 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఇస్రో అధికారికి వెబ్ సైట్ https://www.isro.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీల సంఖ్య:

  • 224

విభాగాల వారీగా ఖాళీలు:

సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ:

  • 05 పోస్టులు

టెక్నికల్ అసిస్టెంట్:

  • 55

సైటిఫిక్ అసిస్టెంట్:

  • 06

లైబ్రరీ అసిస్టెంట్:

  • 01

టెక్నీషియన్ -బీ/డ్రాఫ్ట్స్ మ్యాన్-బి:

  • 142

ఫైర్ మ్యాన్-ఎ:

  • 03

కుక్:

  • 04

లైట్ వెహికిల్ డ్రైవర్ ఎ అండ్ హెవీ వెహికిల్ డ్రైవర్ ఎ:

  • 8

అర్హత:

  • అభ్యర్థులు పోస్టును అనుసరించి టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు పోస్టును అనుసరించి 01.03.2024 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • సైంటిస్ట్ / ఇంజినీర్ – ఎస్సీ / టెక్నికల్ అసిస్టెంట్ / సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.750, టెక్నీషియన్-B/డ్రాఫ్ట్స్‌మ్యాన్-B/కుక్/ ఫైర్‌మ్యాన్-A/ లైట్ వెహికల్ డ్రైవర్-A/ హెవీ వెహికల్ డ్రైవర్-A పోస్టులకు రూ.500.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు సైంటిస్ట్/ ఇంజినీర్-ఎస్సీ పోస్టులకు రూ.56,100; టెక్నికల్ అసిస్టెంట్/సైంటిఫిక్ అసిస్టెంట్/లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900; టెక్నీషియన్-బి/డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులకు రూ.21,700; కుక్/ఫైర్‌మ్యాన్-ఎ/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’/లైట్ వెహికల్ డ్రైవర్ ‘ఎ’&హెవీ వెహికల్ డ్రైవర్ ‘ఎ’ పోస్టులకు రూ.19,900 అందిస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 10-02-2024.

దరఖాస్తుకు చివరితేదీ:

  • 01-03-2024.

ఇస్రో అధికారికి వెబ్ సైట్:

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet