iDreamPost
android-app
ios-app

8th పాసైతే చాలు.. మంచి జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. మిస్ చేసుకోకండి

MDL Apprenticeship recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎనిమిదో తరగతి పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

MDL Apprenticeship recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎనిమిదో తరగతి పాసైతే చాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. వెంటనే అప్లై చేసుకోండి.

8th పాసైతే చాలు.. మంచి జీతంతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్స్.. మిస్ చేసుకోకండి

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలు కలిగి ఉండాలి. మరి ఇంతకంటే తక్కువ క్వాలిఫికేషన్ కలిగిన వారికి కూడా ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మీరు ఎనిమిదో తరగతి పాసయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఎనిమిదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మజగావ్‌ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ అప్రెంటిస్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో మొత్తం 518 పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ ఏ కింద ఈ సంస్థ 218 ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రూప్ బిలో 240 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ సీలో మొత్తం 60 పోస్టులు ఉన్నాయి. 8, 10వ తరగతితో పాటు ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న వారు జులై 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు: 518

  • గ్రూప్ A కింద ఈ సంస్థ 218 ఖాళీలను భర్తీ చేయనుంది. గ్రూప్ Bలో 240 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రూప్ Cలో మొత్తం 60 పోస్టులు ఉన్నాయి.

అర్హత:

  • పదో తరగతి పాసైన వారు గ్రూప్ ఏ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ పూర్తి చేసిన వారు గ్రూప్ బి, 8వ తరగతి పాసైన వారు గ్రూప్ సీ పోస్టుల కోసం పోటీపడొచ్చు.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.

స్టైపెండ్ ఎంత?

  • గ్రూప్ ఏ అప్రెంటిస్ వ్యవధి రెండేళ్లు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి మొదటి 3 నెలల వరకు నెలకు రూ.3,000 స్టైపెండ్ అందుతుంది. ఆ తర్వాత నెలకు రూ.6 వేలు పొందవచ్చు. ఇక ఏడాది పాటు గ్రూప్ బి అప్రెంటిస్‌లకు ట్రైనింగ్ ఉంటుంది. వీరికి నెలకు రూ.8,050 ఇస్తారు. పైప్ ఫిట్టర్, వెల్డర్, కోపా, కార్పెంటర్‌లకు నెలకు రూ.7,700 స్టైపెండ్ అందుతుంది. ఇక గ్రూప్ సీ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ రెండేళ్ల పాటు ఉంటుంది. ఎంపికైన వారికి మొదటి మూడు నెలలు రూ.2,500 వస్తుంది. ఆ తర్వాత 9 నెలలు రూ.5,000, రెండో ఏడాదిలో నెలకు రూ.5,500 పొందవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 02-07-2024