డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా? ఈ Govt జాబ్స్ కు ఇప్పుడే అప్లై చేసుకోండి.. మంచి జీతం

IBPS SO Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 21 వరకు అప్లై చేసుకోవచ్చు.

IBPS SO Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భారీ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఆగస్టు 21 వరకు అప్లై చేసుకోవచ్చు.

జాబ్ లేదని టెన్షన్ పడుతున్నారా? చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? ఇక మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతం అందిస్తారు. మీరు డిగ్రీ, పీజీ, బీటెక్ ఉత్తీర్ణులైతే చాలు ఈ బ్యాంక్ ఉద్యోగాలకు పోటీపడొచ్చు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ పలు జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 896 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను సాధించి లైఫ్ లో సెట్ అయిపోవచ్చు.

ఐబీపీఎస్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టులను అసుసరించి డిగ్రీ, బీటెక్, పీజీ, లా డిగ్రీ పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 20-30 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 21 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు రూ. 850 చెల్లించాలి. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 896

విభాగాల వారీగా ఖాళీలు:

  • ఐటీ ఆఫీసర్ (స్కేల్-1): 170
  • అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్ (స్కేల్-1): 346
  • రాజ్‌భాష అధికారి (స్కేల్-1):25
  • లా ఆఫీసర్ (స్కేల్-1): 125
  • హెచ్ఆర్/ పర్సనల్ ఆఫీసర్ (స్కేల్-1): 25
  • మార్కెటింగ్ ఆఫీసర్(స్కేల్-1): 205

అర్హత:

  • పోస్టులను అసుసరించి డిగ్రీ, బీటెక్, పీజీ, లా డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 01.08.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

దరఖాస్తు ఫీజు:

  • రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం:

  • ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 01-08-2024

దరఖాస్తుకు చివరితేది:

  • 21-08-2024
Show comments