iDreamPost
android-app
ios-app

మళ్లీ రాని అవకాశమిది.. డిగ్రీ అర్హతతో.. 4,187 SI ఉద్యోగాలు..

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో 4,187 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మళీ రాని ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో 4,187 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మళీ రాని ఈ అవకాశాన్ని చేజార్చుకోకండి.

మళ్లీ రాని అవకాశమిది.. డిగ్రీ అర్హతతో.. 4,187 SI ఉద్యోగాలు..

మీరు ఈ ఏడాది జాబ్ కొట్టాలనే కసితో ఉన్నట్లైతే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. భారీ వేతనంతో ఉన్న ఈ ఉద్యోగాలను సాధిస్తే జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్ లో ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 4187 పోస్టులను భర్తీ చేయనున్నారు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు.

ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ మార్చి 4 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 29 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భారీ వేతనం అందుకోవచ్చు. నెలకు రూ. రూ.35,400-రూ.1,12,400 జీతం అందిస్తారు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ ను https://ssc.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల సంఖ్య:

  • 4,187.

విభాగాల వారీగా ఖాళీలు:

సీఏపీఎఫ్ – సెంట్రల్ ఆర్మ్‌డ్‌ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (జీడీ):

  • 4,001

ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- పురుషులు:

  • 125

ఢిల్లీ పోలీసు విభాగంలో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్)- మహిళలు:

  • 61

అర్హత:

  • అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పాసై ఉండాలి. నిబంధనల ప్రకారం నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 01.08.2024 నాటికి 20-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక విధానం:

  • సీబీటీ రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ (పీఈటీ)/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు కల్పించారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ.35,400-రూ.1,12,400 ఇస్తారు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 04-03-2024.

దరఖాస్తు చివరి తేదీ:

  • 28-03-2024.

దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి తేదీ:

  • 29-03-2024.

దరఖాస్తు సవరణ తేదీలు:

  • 30-03-2024 నుంచి 31-03-2024.

సీబీటీ టెస్ట్ తేదీలు:

  • మే 9, 10, 13 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్థారు.