P Venkatesh
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 25 లక్షల జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.
మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ ఉద్యోగాలను అస్సలు వదలకండి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 25 లక్షల జీతం అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.
P Venkatesh
రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ ను రిలీజ్ చేస్తున్నాయి. రైల్వే, నేవీ, ఆర్మీ, బ్యాంకుల నుంచి జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఈ క్రమంలో నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఈ పోస్టులను అస్సలు వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే ఏకంగా ఏడాదికి 25 లక్షల జీతం అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆద్వార్యంలో నడిచే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 54 ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించనున్నారు. ఈ ఉద్యోగాలకు బీఈ/ బీటెక్ లేదా బీసీఏ/ బీఎస్సీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లైయ్ చేసుకోవచ్చు. మే 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.