P Venkatesh
Indian Navy 10+2 (B.TECH) Cadet Entry Scheme: ఇంటర్ పాసైన వారికి తీపి కబురును అందించింది ఇండియన్ నేవీ. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటీఫికేషన్ విడుదల చేసింది.
Indian Navy 10+2 (B.TECH) Cadet Entry Scheme: ఇంటర్ పాసైన వారికి తీపి కబురును అందించింది ఇండియన్ నేవీ. ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటీఫికేషన్ విడుదల చేసింది.
P Venkatesh
భారత త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరాలని యూత్ కలలుకంటుంటారు. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తుంటారు. భారత రక్షణ వ్యవస్థల నుంచి వెలువడే నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మరి మీరు కూడా ఇండియన్ నేవీలో చేరాలనుకుంటున్నారా? మీరు ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఫ్రీగా బీటెక్ చదువుతో పాటు ఉద్యోగం కూడా పొందే ఛాన్స్ వచ్చింది. భారత రక్షణ వ్యవస్థలో పనిచేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం.
ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటీఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా నాలుగేళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో ప్రవేశాలు కల్పించనుంది. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో నాలుగేళ్ల బీటెక్కోర్సుకు క్యాడెట్‌లుగా చేర్చబడతారు. కోర్సు పూర్తయిన తర్వాత, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) బీటెక్ డిగ్రీని ప్రదానం చేస్తుంది.
ఆ తర్వాత ఉద్యోగం కూడా కల్పిస్తుంది. మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్)-2024 పరీక్షలో ర్యాంకు సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జులై 20 వరకు అప్లై చేసుకోవచ్చు. కేరళ రాష్ట్రం ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.