టెన్త్ అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు!

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీరు మాత్రమే అర్హులు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే. కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వీరు మాత్రమే అర్హులు.

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పదో తరగతి అర్హతో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. తాజాగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భారీ వేతనం అందుకోవచ్చు. సీఆర్పీఎఫ్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్-సి విభాగంలో కానిస్టేబుల్-జనరల్ డ్యూటీ నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే పలు క్రీడాంశాల్లో అర్హత సాధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన పురుషులు, మహిళలు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్ ను https://crpf.gov.in/పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం కానిస్టేబుల్ పోస్టులు:

  • 169
  • క్రీడా విభాగాలవారీగా జిమ్నాస్టిక్ లో 06 పోస్టులు, జూడో లో 06 పోస్టులు, వుషులో 09 పోస్టులు, షూటింగ్ లో 09 పోస్టులు, బాక్సింగ్ లో 05 పోస్టులు, అథ్లెటిక్స్ లో 22 పోస్టులు, ఆర్చరీలో 06 పోస్టులు, రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ లో 10 పోస్టులు.. ఇలా పలు క్రీడా విభాగాల్లో మొత్తం 169 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి.

అర్హత:

  • టెన్త్ క్లాస్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 15.02.2024 నాటికి 18 – 23 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్‌

ఎంపిక విధానం:

  • అభ్యర్థులు సంబంధిత క్రీడాంశంలో ప్రతిభ, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.21,700 – రూ.69,100 అందిస్తారు.

‌దరఖాస్తుకు చివరితేదీ:

15-02-2024.

సీఆర్పీఎఫ్ అధికారిక వెబ్ సైట్:

Show comments