iDreamPost
android-app
ios-app

మళ్లీ రాని అవకాశమిది.. హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు 1,36,520 జీతం

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.

మళ్లీ రాని అవకాశమిది.. హైకోర్టులో ఉద్యోగాలు.. నెలకు 1,36,520 జీతం

నిరుద్యోగులకు భారీ శుభవార్త. న్యాయ వ్యవస్థలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. మీరు న్యాయ శాస్త్రంలో పట్టా పొంది ఖాళీగా ఉన్నట్లైతే ఈ అవకాశాన్ని మాత్రం వదలొద్దు. తెలంగాణ హైకోర్టు భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ హైకోర్టు సివిల్ జడ్జీ పోస్టుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 17 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. కాగా సివిల్ జడ్జి పోస్టుల కోసం ఏప్రిల్ 18 2024 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

సివిల్ జడ్జి పోస్టుల సంఖ్య:

  • 150

అర్హత:

  • గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ పొంది ఉండాలి. తెలంగాణ జ్యుడీషియల్ రూల్స్ 2023 ప్రకారం నిర్ధేశించిన అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు కనిష్టంగా 23 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపకి ప్రకియ:

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు జీతం 77,840 నుంచి 1,36,520 వరకు అందుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:

  • ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.

దరఖాస్తులు ప్రారంభ తేదీ:

  • 18-04-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 17-05-2024